ఆమెకు మూడు పేర్లు, ఫేస్‌బుక్ పరిచయం: యువకుడి ఆత్మహత్య
కడప: ఫేస్‌బుక్ ద్వారా మారుపేరుతో పరిచయమైన ఓ యువతి మోసం చేయడంతో ఓ నిండు ప్రాణం గాలిలో కలిసింది. ఆమె మోసాన్ని తట్టుకోలేక అతను ఆత్మహత్య చేసుకున్నాడు.ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఆ యువతికి రూ.10 లక్షలు ఇచ్చాడు. ఆమె తిరిగి ఇవ్వకపోవడంతో ఆత్మహత్య అతను ఆత్మహత్య చేసుకున్నాడు.
కడప జిల్లాలో ఆ విషాద సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని ఖాజీపేట బస్టాండు ప్రాంతంలో బి.నరసింహ వరప్రసాద్ (33) టీ దుకాణం నడుపుకొనేవాడు. కొంతకాలం క్రితం విశాఖపట్టణానికి చెందిన ఓ యువతితో అతడికి ఫేస్‌బుక్ పరిచయం ఏర్పడినట్లు అతని సెల్‌ఫోన్ ద్వారా తెలుస్తోంది.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం - ఫేస్‌బుక్ పరిచయంతోనే వరప్రసాద్ ఆమెకు రూ.10 లక్షల వరకూ పంపాడు. అయితే ఆ తర్వాత ఆ సొమ్ము ఇవ్వాల్సిందిగా ఎన్నిసార్లు అడిగినా ఆమె పట్టించుకోలేదు. ఇస్తానంటూ ఆమె బుకాయిస్తూ వచ్చింది. దాంతో ఆ ఒత్తిడిని తట్టుకోలేక సోమవారం రాత్రి తన ఇంట్లోని బాత్‌రూమ్‌లో ఉరివేసుకొని వరప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు దీనిపై మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నరసింహవరప్రసాద్‌కు ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువతి మూడు పేర్లు చెప్పేదని సమాచారం. ఫేస్‌బుక్‌లో తన పేరును కల్యాణిగా పేర్కొంది. ఫోన్‌లో మాట్లాడేటప్పుడు అనుశ్రీగా చెబుతుండేదని తెలిసింది. అలాగే ఆమె కవిత అనే పేరుతో కూడా వ్యవహరించేదని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications