అన్నాచెల్లెళ్ల ప్రేమ షాక్: పెదనాన్న కొడుకుని ప్రేమించిన యువతి
విజయనగరం: వరుసకు అన్నాచెల్లెళ్లు అయిన వాళ్లు పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించగా, కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపారు. దీంతో యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన ఏపీలోని విజయనగరంలో జరిగింది. అన్నతో పెళ్లి ఏమిటని వారించినందుకు ఆమె ఆత్మహత్యాయత్నం చేయడం గమనార్హం.
శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలానికి చెందిన యువతి అదే గ్రామానికి చెందిన పెదనాన్న కుమారుడితో ప్రేమలో పడింది. యువకుడి తల్లిదండ్రులు విజయనగరంలో ఉంటున్నారు. యువతి అప్పుడప్పుడు పెదనాన్న ఇంటికి వచ్చేది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది.
ఆ యువకుడితో పెళ్లి చేయాలని యువతి కొద్ది రోజుల క్రితం పురుగు మందు తాగేయడంతో పట్టణంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. అనంతరం మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో.. ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చారు.

తమను వీడదీసేందుకు ఇరు కుటుంబాలు ప్రయత్నిస్తున్నాయని చెబుతూ యువతి మంగళవారం మధ్యాహ్నం నిద్రమాత్రలు వేసుకుంది. దీంతో అపస్మారకస్థితిలోకి వెళ్లింది. వెంటనే స్థానికులు జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఇరు కుటుంబాలు గొడవపడ్డాయి.
యువతి తల్లిదండ్రులు ఎంత నచ్చ చెప్పినప్పటికీ ఆ యువకుడితోనే పంపించాలని మొండికేసింది. పంపించకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది.
దీంతో తల్లిదండ్రులు, మహిళా కానిస్టేబుల్ సెక్యూరిటీగా అమ్మాయికి వైద్యం అందిస్తున్నారు. పోలీసులు యువతి వాంగ్మూలం నమోదు చేశారు. యువతి ఆత్మహత్యాయత్నం చేసిందని, వరుసకు అన్నాచెల్లెళ్లు కావడంతో కేసు నమోదు చేయలేదని పోలీసులు చెప్పారు. మరోసారి కౌన్సిలింగ్ చేసి చూస్తామని పోలీసులు అంటున్నారు.












Click it and Unblock the Notifications