లవర్‌తో పెళ్లి: మాట తప్పారని మహిళా విఆర్వో ఫిర్యాదు

రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ మండలంలో విఆర్వోగా పని చేసే ఓ యువతి.. హయత్ నగర్ మండలంలో మవఆర్వోగా విధులు నిర్వర్తిస్తున్న యువకుడు ప్రేమించికున్నారు. ఆ తర్వా యువకుడు పెళ్లికి నిరాకరించడంతో ఆమె గతంలో హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో అతను సహచర ఉద్యోగులు వారిద్దరికీ వివాహం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆమె తన ఫిర్యాదును వాపసు తీసుకున్నారు. రెండు నెలలు గడిచినా పెళ్లి చేయకపోవడంతో విసుగు చెందిన ఆమె.. ప్రియుడితో పాటు హామీ ఇచ్చిన సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
యువకులు అరెస్ట్
నకిలీ నోట్లను చలామణి చేస్తున్న నలుగురు యువకులను తూర్పు మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి లక్షా 20 వేల నకిలీ నగదును స్వాధీనం చేసుకున్నారు. ముంబైకి చెందిన హఫీజ్, హబీబ్ అన్నదమ్ములు. వీరు ముంబై కేంద్రంగా నకిలీ నోట్లను వివిధ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. ఈ విధంగా 1000, 500 రూపాయల నోట్లను పలు ప్రాంతాలకు పంపారు.












Click it and Unblock the Notifications