అమ్మాయిపై 4గురు గ్యాంగ్ రేప్: బాలికపై లైంగిక దాడి

 Girl gang raped in Khammam district
ఖమ్మం/ హైదరాబాద్: ఖమ్మం జిల్లాలోని టేకులపల్లి మండలం మద్రాస్ తండాలో దారుణం జరిగింది. ఓ బాలికపై నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

ఇదిలావుంటే, హైదరాబాద్‌లో ఎంఎంపహాడిలో ఎనిమిది సంవత్సరాల బాలికపై 20 సంవత్సరాల యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎం.ఎం పహాడికి చెందిన ఇమ్రాన్ (20) ఇంట్లో పనిచేయడానికి గురువారం సాయంత్రం ఓ మహిళ వచ్చింది. ఆమె వెంట 8 సంవత్సరాల కుమార్తె ఉంది.

తల్లి బయట పనిచేస్తుండగా బాలికకు మాయమాటలు చెప్పి ఇమ్రాన్ గదిలోకి తీసుకెళ్ళి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక తల్లికి చెప్పగా ఆమె స్థానికుల సహకారంతో రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఫిర్యాదు చేయకుండా ఉండేందుకు ఇమ్రాన్ కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. అయితే బాలిక తల్లి వారిని ఎదిరించి రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+