తల్లిని ఆటోలోంచి తోసేసి అమ్మాయిపై ఐదుగురు అఘాయిత్యం

తల్లిని ఆటోలోంచి కిందికి తోసేసి, బాలికపై డ్రైవర్ సహా ఐదుగురు బాలికపై అత్యాచారం చేశారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది.

నెల్లూరు/ ఏలూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరులో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఐదుగురు దుండగులు బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. నెల్లూరు రైల్వేస్టేషన్‌ దగ్గర తల్లీకూతురు ఇద్దరు ఆటో ఎక్కారు. ఆటోలో ఉన్న డ్రైవర్ మరో నలుగురు వ్యక్తులతో కలిసి తల్లిని బయటకు తోసేసారు. బయటకు తోసేసిన తల్లికి స్వల్ఫ గాయాలు అయ్యాయి.

బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆమెను రోడ్డుపై వదిలేసి వెళ్లారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనపై పోలీసులు అరా తీయగా ముగ్గురు నిందితులను అదుపులో తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Girl gang raped in Nellore district of AP

అనుమానంతో భార్యను చంపేసిన వ్యక్తి

అనుమానంతో భార్యను పచ్చడి బండతో తలపై కొట్టి ఓ వ్యక్తి హత్య చేశాడు. భార్య చంకలో ఉన్న చిన్నారి కుమార్తెకు కూడా బండ దెబ్బలు తగలడంతో తీవ్రంగా గాయపడి, చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ దారుణమైన సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో గురువారం చోటుచేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం వివరాలిలావున్నాయి... ఉండి నిమ్మలపేటకు చెందిన కలిశెట్టి శివనాగరాజు (శివ) కొంతకాలం క్రితం ఉపాధి నిమిత్తం గల్ఫ్‌వెళ్లి వచ్చాడు. అప్పటి నుండి భార్య రమాదేవి(26)ని వేధించేవాడు. గురువారం ఉదయం కూడా భార్యతో గొడవపడిన శివ పక్కనే ఉన్న పచ్చడి బండతో ఆమె తలపై ఇష్టంవచ్చినట్టు కొట్టాడు. ఆ సమయంలో ఆమె చంకలో రెండేళ్ల కుమార్తె ప్రసన్నకుమారి ఉంది. దీనితో ఆ చిన్నారికి కూడా బండ దెబ్బలు తగిలాయి.

శివ కొట్టిన దెబ్బలకు రమాదేవి కుప్పకూలి అక్కడికక్కడే మృతిచెందింది. దెబ్బలు తగిలిన రెండేళ్ల ప్రసన్నకుమారి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. ఘటన అనంతరం శివ పోలీసు స్టేషన్‌కు వచ్చి, తాను భార్యను హత్యచేసినట్టు తెలిపాడు.

దాంతో ఉండి పోలీసులు కేసు నమోదుచేసి, దర్యాప్తుచేస్తున్నారు. కాగా నర్సాపురం డిఎస్పీ ఎం.పూర్ణచంద్రరావు గురువారం మధ్యాహ్నం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సంఘటనకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. భీమవరం రూరల్ సిఐ జయసూర్య, ఉండి ఎస్సై రవివర్మ ఆయన వెంట ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+