జాబ్ వెతుక్కోవడం కోసం వెళ్లి 19 ఏళ్ల యువతి అదృశ్యం

హైదరాబాద్: ఉద్యోగం కోసం ఇంటి నుండి వెళ్లిన యువతి అదృశ్యమైన సంఘటన అంబరుపేట పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. గోల్నాక శాంతినగర్‌కు చెందిన పంతొమ్మిదేళ్ల దీపిక ఈ నెల 18వ తేదీన ఉదయం ఉద్యోగం వెతుక్కోవడం కోసం నల్లకుంటకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లింది. తిరిగి ఇంటికి రాలేదు. దీంతో తల్లి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కాల్పుల కేసు నిందితులు కోర్టుకు హాజరు

పెద అవుటపల్లి కాల్పుల కేసులో 16 మంది నిందితులను పోలీ సులు బుధవారం గన్నవరం కోర్టులో హాజరుపరిచారు. కొన్నిరోజుల క్రితం విజయవాడ పోలీసులు పట్టుకున్న, కోర్టులో లొంగిపోయిన ఈ నిందితులను పోలీసులు కస్టడీకి కోరగా, ఈ నెల 19 మధ్యాహ్నం వరకు వారిని పోలీసు కస్టడీకి ఇస్తూ కోర్టు అనుమతించింది.

బుధవారంతో గడుపు ముగియటంతో ఈ కేసులో నిందితులు పురాణం గణేష్‌, ఊరా గోపిశ్రీను, తూరపాటి పెదబాబు, ప్రతాప్ సింగ్‌, ధర్మవీర్‌, నీరజ్‌, నితీన్‌, మంజిత్‌సింగ్‌ సతీష్‌బాబా, పంకజ్‌, భూతం బాలాజీ, పాస్తం మహేష్‌, పాలపాటి శివ, సిరిగిరి గోపరాజు, కిన్నెర శ్రీను, వెంకటేష్‌, పేర్ల పల్లారావు, పేర్ల జ్యోతిలకు కోర్టు రిమాండ్‌ విధించింది. వీరంతా డిసెంబర్‌ 3వ తేదీన వాయిదాకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.

 Girl goes missing in Hyderabad

చిట్టీల పేరిట మోసం

చిట్టీల పేరిట ప్రతినెల వసూలు చేసిన సొమ్మును సంబంధిత సభ్యులకు ఇవ్వాల్సి ఉండగా నెలల తరబడి కాలయాపన చేస్తూ కనిపించకుండాపోయిన ఓ మోసగాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంచిర్యాల పట్టణంలోని చిన్నాపెద్దా వ్యాపారుల నుంచి లక్షల రూపాయలకు ఎగనామం పెట్టి 20రోజుల కిందట పారిపోయిన సురేందర్‌ అనే వ్యక్తి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.

చెరువులో పడి బాలుడి మృతి

విజయనగరం జిల్లాలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి పార్వతీపురంకు చెందిన గణేష్‌ (11) అనే బాలుడు బుధవారం ఉదయం మృతిచెందాడు. రాయగడ రోడ్డు శివారునున్న అగ్రహారం శివాలయం కోనేరులో స్నానానికి దిగి ఈత రాక మృతిచెందాడు. మృతుడి తల్లిదండ్రులు ఉపాధి నిమిత్తం ఏలూరు వలస వెళ్లారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+