ఆటో డ్రైవర్ చరిత్ర ఇదే: బాలికను అపహరించి, నోట్లో గుడ్డలు కుక్కి రేప్
ఒంగోలు: ఇంటి ముందు ఆడుకుంటున్న పాపం పుణ్యం ప్రపంచ మార్గం తెలియని బాలికను ఆటోలో అపహరించి అత్యాచారం జరిపిన ఘటన ప్రకాశం జిల్లాలో సంచలనం సృష్టించింది. ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం చినలాటరపి గ్రామానికి చెందిన 12 ఏళ్ల బాలిక తన నాయనమ్మ దగ్గర పెరుగుతోంది.
బతుకుదెరువు కోసం తల్లిదండ్రులు గుంటూరు జిల్లాకు వెళ్లడంతో ఇద్దరే ఇంటి దగ్గర ఉంటున్నారు. అది గమనించిన ఆటో డ్రైవర్ నంబూరి కొండలరావు గురువారం ఆమెపై దాడి చేశాడు. బాలిక నోట్లో గుడ్డలు కుక్కి ఆటోలో నరసాపురం అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.

చీకటి పడే వేళ బాలికను ఊరి శివార్లలో వదిలేసిపోయాడు. బాలిక ద్వారా విషయం తెలుసుకున్న నాయనమ్మ కొండలరావుపై పోలీ్‌సస్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే, అప్పటికే కొండలరావుపై అత్యాచారం కేసు నమోదు అయింది.
ఆ కేసులో ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చాడని పోలీసులు చెబుతున్నారు. అంతేకాదు, ఇప్పటిదాకా ఐదుగురిని పెళ్లి పేరిట కొండలరావు మోసం చేశాడని కూడా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications