పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ప్రియురాలిని చంపించాడు

Girl killed in Kurnool
కర్నూలు/హైదరాబాద్: కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని మంత్రాలయం మండలంలో ఓ ప్రియుడు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ప్రియురాలిని కొందరు దుండగులతో హత్య చేయించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఎయిర్ పోర్టులో అలర్ట్

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద శుక్రవారం అలర్ట్ ప్రకటించారు. ఓ విమానంలో పేలుడు పదార్థాలు రవాణా అవుతున్నట్టు విమానాశ్రయానికి ఓ లేఖ అందింది.

ఎయిర్ పోర్టు ప్రధాన భద్రతాధికారి పేరిట ఈ లేఖ అందింది. ఈ నేపథ్యంలో విమానాశ్రయం వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. భారీ ఎత్తున సిఐఎస్ఎఫ్ బలగాలతో పాటు స్నిఫర్ డాగ్స్‌ను మోహరించారు.

విద్యార్థి ఆత్మహత్యాయత్నం

ఇష్టం లేని కోర్సులో చేర్పించారనే ఆగ్రహంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కీసర మండలానికి చెందిన అమ్మాయిని తల్లిదండ్రులు ఎంబిఏలో చేర్పించారు. ఎంబిఏ చదవడం ఇశ్టం లేక శుక్రవారం ఉదయం కళాశాల భవనం పై నుండి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెను ఆసుపత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+