రేప్ చేసి కడుపు చేశాడు: రూ.2.20 లక్షలు ఖరీదు కట్టాడు
కడప: కడప జిల్లా చాపాడు మండలం చీపాడులో అమానుషమైన సంఘటన చోటు చేసుకుంది. చీపాడు గ్రామంలోని బాలికపై అదే గ్రామానికి చెందిన వృద్ధుడు అత్యాచారం చేశాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. కాగా, వృద్ధుడు పెద్దమనషులతో పంచాయితీ పెట్టించి బాలిక మానానికి రూ.2.20 లక్షలు వెలకట్టాడు.
చాపాడు మండలం చియ్యపాడు గ్రామానికి చెందిన ఆలయ మాజీ ధర్మకర్త, గ్రామ నాయకుడు వీరరాఘవరెడ్డి అదే గ్రామానికి చెందిన ఓ బాలికను తమ ఇంట్లో పనిమనిషిగా కుదుర్చుకున్నాడు. 61 ఏళ్ల వయస్సు గల వీరరాఘవరెడ్డి బాలికపై బలవంతంగా అత్యాచారం చేస్తూ కామవాంఛ తీర్చుకునేవాడు. ఆ బాలిక గర్భం దాల్చడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది.
తన కూతురిపై అత్యాచారం చేయడాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు యజమానిని నిలదీశారు. దీంతో వీరరాఘవరెడ్డి బంధువులు మైదుకూరులోని ఓ పెద్దమనిషి ఇంట్లో బేరసారాలు ఆమె శీలానికి ఖరీదు కట్టారు. రూ.2.20 లక్షలు డబ్బులు ఇచ్చి గర్భస్రావం చేయించుకోమని బాలిక తల్లిదండ్రులను ఆదేశించాడు.

దాంతో చేసేది ఏమీలేక ఆ బాలిక తల్లిదండ్రులు గర్భం తీయించుకునేందుకు మైదుకూరులోని మందుల దుకాణంలో టాబ్లెట్ గర్భ స్రావం మందులు వేయించారు. ఆ మందుల వల్ల బాలికకు రకస్రావం కావడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చావుబతుకుల మధ్య ఉండటంతో వైద్యులు బాలిక ప్రాణాలు కాపాడారు. ఈ వ్యవహారం గుప్పుమనడంతో సీఐ వెంకటేశ్వర్లు ప్రైవేట్ ఆస్పత్రిని తనఖీ చేశారు. బాలిక గురించి ఆరా తీశారు.
వీరరాఘవరెడ్డిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. బాలిక తల్లిదండ్రులను విచారించారు. ఈ విషయంపై ప్రైవేట్ ఆస్ప త్రిలో జిల్లా ఉప వైద్యాధికారి వెంకటేశ్వర్లు విచారణ చేపట్టారు.. తాము వారి ఇంట్లో పనికి కుమార్తెను పంపేవారమని, రాఘవరెడ్డి మా బిడ్డకు మాయమాటలు చెప్పి గర్భవతిని చేశాడని బాలిక తండ్రి తెలిపారు. బాధిత తండ్రి చాపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం రాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications