బాలికపై రేప్ యత్నం, నగ్న ఫోటోలు తీశానని బెదిరించి రేప్
అనంతపురం/ఏలూరు: అనంతపురం జిల్లాలోని డీసీ పల్లిలో బాలిక (13)పై అదే గ్రామానికి చెందిన యువకుడు తిప్పేస్వామి అత్యాచారానికి యత్నించాడు. బాలిక తల్లి ఇటీవలే మృతిచెందింది. తండ్రి వికలాంగుడు. ఈ నేపథ్యంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై తిప్పేస్వామి అత్యాచార యత్నం చేశాడు. బాలిక ఈ విషయం తన బంధువులకు చెప్పింది. వారు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
వివాహిత ఆత్మహత్య
చిలమతూరు మండలంలోని ఓ గ్రామంలో వివాహిత కుటుంబ కలహాలతో సో మవారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకుంది. కమ్మయ్యగారిపల్లికి చెందిన ఈమెకు రెండేళ్ల క్రితం పరిగి మండలం కాలువపల్లి గ్రామానికి చెందిన హరితో వివాహమైంది. భర్తతో విబేధాలు తలెత్తడంతో కొంతకాలంగా ఆ మె పుట్టింట్లోనే ఉంటోంది.

ఈ నేపథ్యంలో సోమవారం ఆమె శరీరంపై కిరోసిన్ పోసుకుని, నిప్పంటించుకుంది. చుట్టుపక్కలవారు గమనించి రక్షించేందుకు ఇంటి తలుపులు బద్దలుకొట్టారు. అప్పటికే ఆమె మృతిచెందింది. దీనిపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
యువతి కిడ్నాప్ అత్యాచారం
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం టౌన్ మండలంలోని పంగిడిగూడెం గ్రామానికి చెందిన యువతిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన యువకుడిపై కేసు నమోదు చేశారు. గ్రామానికి చెందిన యువతి పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది. ఆమెకు దగ్గర బంధువైన రాజేష్ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు.
ఈ నేపథ్యంలో ఆమెను వివాహం చేసుకుంటానని ఆమె తల్లిదండ్రులతో చెప్పగా వారు మందలించారు. తర్వాత ఆమె కోచింగ్ నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్ళింది. తర్వాత రాజేష్ ఆమెను ఫోన్ చేసి బెదిరించేవాడు. కొంతకాలం తర్వాత సెలవుల నిమిత్తం ఇంటికి వచ్చిన ఆమెను మాయమాటలతో వేరే ఇంటికి రప్పించి కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చాడు.
స్పృహతప్పిన ఆమెను నగ్నంగా ఫోటోలు తీశానని, తనను పెళ్ళి చేసుకోకుంటే నెట్‌లో పెడతానని బెదిరించసాగాడు. ఇదిలా ఉండగా ఇటీవల ఆమె మళ్లీ హైదరాబాద్ వెళ్ళే నిమిత్తం జంగారెడ్డిగూడెం బస్టాండ్‌కు రాగా ఆమెను కారులో ఎక్కించుకుని ఏలూరు గెస్హ్‌హౌస్‌లో బంధించి అత్యాచారం చేశాడు.
నాలుగు రోజులు అతడి చెరలో ఉన్న యువతి ఎట్టకేలకు అక్కడి నుంచి తప్పించుకుని పంగిడిగూడెం చేరుకుని జంగారెడ్డిగూడెం పోలీసులను ఆశ్రయించింది. దీనిపై రాజేష్‌పై కిడ్నాప్, అత్యాచారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications