తొమ్మిదేళ్ల ప్రేమ: దాక్కున్న ప్రియుడు, ప్రేయసి ధర్నా

గుంటూరు: తొమ్మిది ఏళ్ల నుండి ప్రేమ పేరుతో తిరిగిన వ్యక్తి తీరా పెళ్లికి నిరాకరించడంతో ఓ ప్రేయసి ధర్నాకు దిగిన సంఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. తాడేపల్లికి చెందిన అనిల్ అదే గ్రామానికి చెందిన యువతి తొమ్మిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

తీరా పెళ్లి అనేసరికి అనిల్ వెనక్కి పోయాడు. అతను తప్పించుకొని తిరుగుతున్నాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతను పోలీసులకు చిక్కడం లేదు. దీంతో ఆ ప్రియురాలు ప్రియుడి ఇంటి ముందు కుటుంబ సభ్యులతో బైఠాయించింది.

Girl stages dharna at lovers residence

దుండగుల హల్‌చల్‌

గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో దొంగలు హల్‌చల్‌ చేశారు. ఓ వాహనంలో వచ్చిన కొందరు దుండగులు మిర్చి ఆటోను అడ్డుకుని అందులోని వారిపై కత్తులతో దాడికి యత్నించారు. భయభ్రాంతులకు గురైన ఆటోలోని వ్యక్తులు పారిపోయారు. అయితే, మిర్చి ఆటోతో పరారైన దొంగలు.. ఆ ఆటో మధ్యలోనే బోల్తా పడటంతో వదిలేసి వెళ్లిపోయారు.

ట్రిపుల్‌ ఐటీ భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

కడప జిల్లా ఇడుపుల పాయలోని ట్రిపుల్‌ ఐటీలో ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన కడప జిల్లాలో జరిగింది. ఇడుపుల పాయలోని ట్రిపుల్‌ ఐటీలో భవనంపై నుంచి ఓ విద్యార్థిని దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. తీవ్రంగా గాయపడిన విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+