హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాబోయే భర్త ఎదుటే సెమీ న్యూడ్‌గా గర్ల్‌ను వీడియో

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కొందరు దుండగులు ఓ యువతిని బట్టలు లాగి ఫోటో తీయడమే కాకుండా, సెమీ న్యూడ్‌గా ఫోటో తీశారు. ఈ సంఘటన జాలపల్లి సమీపంలో జరిగింది. ఈ సంఘటన గురువారం జరిగినప్పటికీ ఆలస్యంగా.. శనివారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు, కాబోయే భర్త కలిసి ఫాం హౌస్‌కు వెళ్లారు.

ఆ సమయంలో కొందరు వ్యక్తులు వారిని అడ్డగించి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. అనంతరం వారు పారిపోయారు. ఈ విషయాన్ని ఆ యువతి, కాబోయే భర్తలు వారి వారి కుటుంబ సభ్యులకు చెప్పారు. అది కాబోయే భర్త ఫాం హౌస్.

Girl stripped and photographed

వారిని ఫాం హౌస్‌కు దగ్గర్లో అడ్డగించిన వారిలో ఐదారుగులు ఉన్నారు. బాధితురాలిని, కాబోయే భర్తను బెదిరించారు. ఆమెను సెమీ న్యూడ్‌గా ఫోటోలు తీశారు. అనంతరం వీడియో తీశారు. అనంతరం బాధితుల వద్ద ఉన్న డబ్బును తీసుకొని పారిపోయారు. వారి నుండి నిందితులు ఆరువేల రూపాయలు తీసుకున్నారు.

పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇది స్థానిక యువకుల ఘాతుకం కావొచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పలువురు అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారని సమాచారం.

English summary
A young woman was allegedly stripped and was photographed and videographed seminude by some youngsters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X