ఎస్కేయూ హాస్టల్ గదిలో విద్యార్థిని ఆత్మహత్య
అనంతపురం జిల్లాలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ జువాలజీ సెకండియర్ చదువుతున్న లక్ష్మీ ప్రసన్న అనే విద్యార్థిని సోమవారం తన హాస్టల్ గదిలోనే ఆత్మహత్య చేసుకుంది.
అనంతపురం: రాష్ట్రంలో విద్యార్థినుల ఆత్మహత్యలు అధికమవుతున్నాయి. అనంతపురం జిల్లాలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో పీజీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న లక్ష్మీ ప్రసన్న అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
లక్ష్మీ ప్రసన్న ఎమ్మెస్సీ జువాలజీ సెకండియర్ చదువుతోంది. రోజూలాగే సోమవారం ఉదయం కూడా కాలేజీకి వెళ్లింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో కాలేజీ నుంచి తిరిగి వచ్చి.. గోదావరి హాస్టల్‌లో తనకు కేటాయించిన గదిలోకి వెళ్లింది.

అనంతరం గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకుంది. మధ్యాహ్నం భోజనం కోసం హాస్టల్‌కు వచ్చిన విద్యార్థినులు ఇది గమనించి విద్యార్థులు హాస్టల్ అధికారులు, యూనివర్సిటీ అధికారులకు సమాచారం అందించారు.
విషయం తెలియగానే యూనివర్శిటీ ఉపకులపతి రాజగోపాల్, రిజిస్ట్రార్ సుధాకర్ బాబు, ఇతర అధ్యాపకులు హాస్టల్‌కు చేరుకుని వివరాలు ఆరా తీశారు. ఈలోగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. విద్యార్థిని మృతిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
లక్ష్మీ ప్రసన్న గోరంట్ల మండలం చౌడేశ్వరి కాలనీకి చెందిన జయమ్మ, నాగరాజుల కుమార్తె. అయితే ఆమె ఆత్మహత్యకు దారితీసిన కారణాలేమిటో తెలియరాలేదు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications