గర్ల్స్ సహజీవనం, అమ్మాయే భర్తగా: విడిచి ఉండలేక...
వరంగల్: తన స్నేహితురాలిని విడిచి ఉండలేనని ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన వరంగల్ జిల్లాలో మంగళవారం జరిగింది. గూడురు మండలం కొంగరిగిద్ద గ్రామానికి చెందిన కల్పన, మహబూబాబాద్ మండలం శనగపురం గ్రామ శివారు వీరారం తండాకు చెందిన సరిత రెండేళ్లుగా మానుకోటలోని ఓ నర్సింగ్ కళాశాలలో శిక్షణ పొందుతున్నారు.
వీరి మధ్య స్నేహం చిగురించింది. ఇద్దరూ ఒకే గదిని అద్దెకు తీసుకొని ఉంటున్న క్రమంలో వారిద్దరి మధ్య స్నేహం మరింత దగ్గర చేసింది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని పరిస్థితికి చేరింది. ఇద్దరి మనసులు కలిశారు. జంటగా జీవించాలనుకొని సహజీవనం చేయాలని నిర్ణయించుకున్నారు.

ఇందుకోసం సరితతో కల్పన తన మెడలో తాళికూడా కట్టించుకుంది. సరిత భర్త అవతారం ఎత్తింది. అందుకు తగినట్లుగా డ్రెస్ కూడా మగవారివి వేసుకోవడం ప్రారంభించింది. భర్త స్థానంలో సరిత ఉంది. ఈ క్రమంలో కల్పనకు పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు సంబంధాలు చూస్తున్నారు.

కల్పన పెళ్లికి నిరాకరించడంతో సందేహించిన ఆమె అక్కాబావలు మానుకోటలోని వారు అద్దెకు ఉంటున్న గదికి వచ్చి విచారిస్తే కల్పన, సరితల సహజీవనం వెలుగు చూసింది. దీంతో ఆగ్రహించిన అక్కాబావలు కల్పనను సోమవారం కొట్టి ఇంటికి తీసుకెళ్లారు. దీనిని తట్టుకోలేక సరిత పురుగుల మందు తాగి ఆత్మహత్యాయద్నానికి పాల్పడింది. స్థానికులు గుర్తించి మానుకోటలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. సరిత చికిత్స పొందుతోంది.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications