ఏపీలో ప్రభుత్వ పాఠశాలలకు వేసవి సెలవులను ప్రకటించిన ప్రభుత్వం
Summer holidays for AP School: రాష్ట్రంలో విద్యా సంవత్సరం ముగింపుకొచ్చింది. వార్షిక పరీక్షలు చాలావరకు ముగిశాయి. ఈ పరిస్థితుల్లో విద్యార్థులందరికీ గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం. వేసవి సెలవులను ప్రకటించింది. అన్ని పాఠశాలలకు సెలవులను ఇచ్చింది. ఈ మేరకు విద్యా మంత్రిత్వ శాఖ కొద్దిసేపటి కిందటే ఉత్తర్వులను జారీ చేసింది.
ఈ నెల 24వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు సెలవులు కొనసాగుతాయని వెల్లడించింది. 40 రోజుల పాటు పాఠశాలలకు సెలవు వర్తింపజేసింది. మళ్లీ యధాతథంగా జూన్ 12వ తేదీ నుంచి పాఠశాలల పునః ప్రారంభమౌతాయి.

ఈ వేసవి సెలవుల్లో ఎవరైనా ప్రత్యేక తరగతులను నిర్వహిస్తే కఠిన చర్యలను తీసుకుంటామని విద్యా మంత్రిత్వ శాఖ అధికారులు హెచ్చరించారు. ఎలాంటి ప్రత్యేక తరగతులను కూడా నిర్వహించకూడదని ఆదేశించారు. అలాంటివి ఎక్కడైనా జరిగితే మండల విద్యా శాఖ అధికారి దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుంది.
ఏపీలో 10వ తరగతి వార్షిక పరీక్షలు ఇప్పటికే ముగిసిన విషయం తెలిసిందే. మార్చి 18వ తేదీన ఆరంభమైన పదో తరగతి పరీక్షలు 30వ తేదీ వరకు కొనసాగాయి. ఆరు లక్షలమందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలను రాశారు. ఈ నెల 19వ తేదీన వాల్యుయేషన్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల చివరి వరకూ ఇది కొనసాగవచ్చు.
ఒకవంక 10వ తరగతి పరీక్షలు ముగియటం, మరోవంక ఎండ తీవ్రత అధికమౌతోన్న నేపథ్యంలో వేసవి సెలవును ప్రకటించింది ప్రభుత్వం. ఈ నెల 24వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు సెలవులు ఉంటాయని వెల్లడించింది. అటు రాష్ట్రంలో రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రత నమోదవుతోంది. రాయలసీమ జిల్లాల్లో 41 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రత రికార్డయింది.
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications