క్షేమంగా వెళ్లండి.. దగ్గరుండి పంపిస్తున్న సోము, జీవీఎల్?
పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకే సోము అలా మాట్లాడుతున్నారని, కన్నా రాజకీయ దురుద్దేశంతోనే వ్యాఖ్యలు చేస్తున్నారని, అది సరికాదని జీవీఎల్ అంటున్నారు.
భారతీయ జనతాపార్టీ నుంచి బయటకు వచ్చే ప్రతి నాయకుడి ఆరోపణ ఒక్కటే. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వైఖరి బాగోలేదని, ఇతర నాయకులతో అతను వ్యవహరించేతీరు సరిగా లేదని, సరైన గౌరవం ఇవ్వరని చెబుతున్నారు. కన్నా లక్ష్మీనారాయణ పార్టీ నుంచి బయటకు వెళ్లడంపై సోము వీర్రాజు స్పందించలేదు. కానీ జీవీఎల్ నరసింహారావు స్పందించారు. మాట్లాడారు.
పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకే సోము అలా మాట్లాడుతున్నారని, కన్నా రాజకీయ దురుద్దేశంతోనే వ్యాఖ్యలు చేస్తున్నారని, అది సరికాదన్నారు. కన్నాకు బీజేపీ సముచిత స్థానం కల్పించిందన్నారు. అయితే సోము పనితీరువల్లే తాను బీజేపీని వీడాల్సి వచ్చిందని కన్నా పదే పదే చెబుతున్నారు. అంతేకాదు.. కొంతమంది నాయకులు రాత్రికి రాత్రే స్టార్లు అయిపోదామనుకుంటున్నారంటూ జీవీఎల్ నరసింహారావు వైఖరిపై పరోక్షంగా సెటైర్లు వేశారు.

తాజాగా విష్ణుకుమార్ రాజు కూడా పార్టీ మారే యోచనలో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి కూడా పార్టీ మారాలనుకుంటున్నారంటే కచ్చితంగా పార్టీలో సరైన నాయకత్వం లోపించడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. విష్ణుకుమార్ రాజు ఏ పార్టీలో చేరతారనే విషయమై స్పష్టత రానప్పటికీ టీడీపీలో చేరే అవకాశాలున్నాయంటున్నారు. 2014లో పొత్తులో భాగంగా విశాఖ సిటీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. పార్టీలో ఏం జరుగుతుందో అర్థం కావడంలేదని, కార్యకర్తలతో మాట్లాడే సమయం పార్టీ అధిష్టానానికి లేదని విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు.
పార్టీకి రాజీనామా చేసిన కన్నాను రాజు కలిశారు. పార్టీలో విభేదాల గురించి అధిష్టానానికి చెప్పినప్పటికీ పట్టించుకోవడంలేదని వాపోయారు. కన్నాతో వ్యక్తిగత అనుబంధం ఉండటంవల్లే వచ్చి కలిశానన్నారు. రాజు వ్యాఖ్యల తీవ్రత చూసిన తర్వాత మాత్రం ఆయన పార్టీమారే ఉద్దేశంలో ఉన్నారంటున్నారు. సోము వీర్రాజు పార్టీ అధ్యక్షుడైన తర్వాత విష్ణుకుమార్ రాజుకు పార్టీలో ప్రాధాన్యం తగ్గించారు. అంతేకాకుండా కన్నా హయాంలో జిల్లా అధ్యక్షులుగా కొందరిని నియమించారు. వీరందరినీ సోము సాగనంపడమే కాకుండా ఇతర అనుబంధ విభాగాల్లో నియమితులైన కన్నా అనుచరవర్గాన్ని కూడా సాగనంపారు. ఇది కన్నాకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..!












Click it and Unblock the Notifications