Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అన్నీ విజయాలే, అరుదైన అవకాశం - రెండు రూపాల్లో దుర్గమ్మ దర్శనం..!!

ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న దేవి శరన్నవరాత్రులు చివరి రోజుకు చేరుకున్నాయి. దసరా వేళ అమ్మవారిని దర్శించుకొనేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఈ రోజున అమ్మవారు రెండు అలంకరణల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ రోజు సాయంత్రం కృష్ణానదిలో ఉత్సవమూర్తులను పోలీసులు ఊరేగింపుగా దుర్గాఘాట్‌కు తీసుకెళ్తారు. గంగా పార్వతి సమేత మల్లేశ్వరుల స్వామివార్లు హంసవాహాణంపై నదివిహారం చేస్తారు.

రెండు రూపాల్లో దర్శనం:విజయవాడ ఇంద్రకీలాద్రిపై నవరాత్రుల ఉత్సవాలు చివరి రోజుకు చేరాయి. ఈ రోజు భక్తులకు అరుదైన అవకాశం కలగనుంది. ఈరోజు తెల్లవారుజామున 3 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మహార్నవమి గడియల్లో శ్రీ మహిషాసుర మర్ధనీదేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత శ్రీ రాజరాజేశ్వరి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.శరన్నవరాత్రులలో దర్శనమిస్తున్న దేవి అలంకారాలలో మహిషాసురమర్ధనికి ఎంతో విశిష్టత ఉంది. రాక్షసులను సంహరించి స్వయంభుగా వెలిసిన మహిషాసుర మర్ధనీ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. మధ్యాహ్నం నుండి దశమి గడియల్లో అంటే విజయదశమినాడు శ్రీ రాజరాజేశ్వరిదేవిగా కనకదుర్గమ్మ దర్శనమిస్తారు. మహిషాసురమర్ధనిని దర్శించుకుంటే దసరా రోజు రాజరాజేశ్వరిని కూడా దర్శించుకోవాలనే నానుడి భక్తుల్లో ఇప్పటికీ నెలకొనిఉంది.

Goddess Durga appears in Mahishasura Mardhani and Raja Rajeswari in Vijayadasami hours

తరలి వస్తున్న భక్తులు:విజయదశమి నాడు అమ్మవారిని దర్శించుకుంటే అన్ని విజయాలు చేకూరతాయని భక్తుల విశ్వాసం. దేశ వ్యాప్తంగా విజయదశమి పండుగను భక్తులు జరుపుకుంటారు. విజయదశమికి ఎంతో విశిష్టత ఉంది. సింహావాహినిగా రూపొందిన శక్తి వికటాట్టహాసం చేసి మహిషాసురిడి సేనాపతులైన చిక్షురుడు, చామరుడు, ఉదద్రుడు, బాష్కులుడు, బిడాలుడు, వంటి రాక్షసులందరినీ సంహరించింది.

ఆ తర్వాత జరిగిన యుద్దంలో దేవి అవలీలగా మహిషాసురుణ్ణి చంపి అదే స్వరూపంతో కీలాద్రిపై స్వయంభువైంది. రౌద్రంలో ఉన్న అమ్మను శాంతిపచేసేందుకు ఇంద్రుడు తపస్సు చేసారు. అష్టభుజాలతో అవతరించి సింహవాహినియై దుష్టుడైన మహిషాసురుడిని సంహరించింది. అమ్మవారి సహజస్వరూపం ఇదే. మహిషాసుర మర్ధనని దర్శించుకుంటే అరిషడ్వర్గాలు నశిస్తాయని సాత్విక భావం ఏర్పడుతుంది. సర్వదోషాలు పటాపంచలై ధైర్య , స్థైర్య , విజయాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం.

Goddess Durga appears in Mahishasura Mardhani and Raja Rajeswari in Vijayadasami hours

హంసవాహాణంపై నదివిహారం:రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు సింహావాహనంపై ఆసీనురాలై ఉంటారు. షోడశాక్షరీ మహామంత్ర స్వరూపిణి మహాత్రిపుర సుందరి, శ్రీచక్ర అధిష్టానదేవత శ్రీ రాజరాజేశ్వరి దేవి విజయదశమి అపరాజితాదేవి పేరు మీద ఏర్పడింది. విజయాన్ని సాధించిది కాబట్టి విజయ అని అంటారు. పరమశాంతి రూపంతో చిరునవ్వులు చిందిస్తూ చెరకుగడ చేతితో పట్టుకుని అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుంది. రాజరాజేశ్వరీ దేవిని సేవించడం వలన జీవితం ధన్యమవుతుందని, నవరాత్రుల పుణ్యపలం సకల శుభాలు, విజయాలు సిధ్దిస్తాయని భక్తుల విశ్వాసం. కాగా ఈ రోజు సాయంత్రం కృష్ణానదిలో ఉత్సవమూర్తులను పోలీసులు ఊరేగింపుగా దుర్గాఘాట్‌కు తీసుకెళ్తారు. గంగా పార్వతి సమేత మల్లేశ్వరుల స్వామివార్లు హంసవాహాణంపై నదివిహారం చేయటం ద్వారా నవరాత్రుల ఉత్సవాలు ముగియనున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+