పెట్టుబడుల కోసమని వెళ్లి...పెట్టుడుపళ్లతో తిరిగి వస్తున్నారు:రోజా;కేంద్రాన్ని జగన్‌ మేనేజ్:వర్ల

Recommended Video

    కేంద్రాన్ని జగన్‌ మేనేజ్ చేస్తున్నారు: వర్ల

    గుంటూరు:జగన్ కేంద్రాన్ని మేనేజ్‌ చేయడం వల్లే అతడి అక్రమాస్తుల కేసుల విచారణ నత్తనడకన సాగుతోందని ఏపీఎస్‌ ఆర్టీసీ చైర్మన్‌ వర్ల రామయ్య ఆరోపించారు. కేసుల విచారణ ముగిస్తే జగన్‌కు జైలుశిక్ష ఖాయమని వర్ల తేల్చిచెప్పారు.

    గుంటూరు పర్యటన సందర్భంగా వర్ల రామయ్య అక్కడ మీడియాతో మాట్లాడారు. రాజకీయ నాయకులపై ఉన్న కేసులను ఏడాదిలోగా పూర్తి చేస్తామన్న ప్రధాని మోడీ చెప్పిన మాట ఏమైందని వర్ల రామయ్య ప్రశ్నించారు. జగన్ కేంద్ర హోం శాఖను, ప్రధాని మోడీ, బిజెపిని మేనేజ్ చేయడం వల్లే ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లి వస్తున్నాడని, అంతకుమించి మరేమీ జరగడం లేదని ఆయన విమర్శించారు.జగన్ కేసుల విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని వర్ల రామయ్య కోరారు.

    Going for investments and returning with dentures:YCP MLA Roja

    మరోవైపు గుంటూరు జిల్లా పర్యటనకు విచ్చేసిన ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ కారెం శివాజీ మీడియాతో మాట్లాడుతూ విపక్ష నేత జగన్‌కు రాష్ట్రంలోని ప్రజాసమస్యలు పట్టవని ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టానికి తూట్లు పొడిచే వారిపై కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలని కారెం శివాజీ డిమాండ్‌ చేశారు. ఈ చట్టాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని ఆయన డిమాండ్‌ చేశారు. భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం దళిత, గిరిజన, మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో సెప్టెంబరు 22న ఛలో అమరావతి భారీ ర్యాలీ జరుగుతుందని కారెం శివాజీ వెల్లడించారు.

    మరోవైపు విశాఖపట్టణం వైసిపి కార్యాలయంలో వైసిపి ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్ర మంత్రులు విదేశీ పర్యటనలకు రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు వెళ్తున్నారని జనం అనుకుంటుంటే...పెట్టుడు పళ్లతో తిరిగి వస్తున్నారని రోజా ఎద్దేవా చేశారు. డ్వాక్రా మహిళల రుణాలను రద్దు చేయడానికి ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవని చెప్పే చంద్రబాబు...ఇలా విదేశీ పర్యటనలు, హంగు, ఆర్భాటాల కోసం వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని ఆమె ఆరోపించారు.

    రాష్ట్రంలో మహిళలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయిందని, ఐదేళ్ల బాలిక నుంచి 60 ఏళ్ల వృద్ధులపై అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు తరచూ చెప్పే 'డబుల్‌ డిజిట్‌ గ్రోత్‌' అనేది రాష్ట్రాభివృద్ధిలో కనిపించకపోయినా మహిళలపై అఘాయిత్యాల్లో మాత్రం కనిపిస్తోందని ఆమె విమర్శించారు. ఇక గత ఎన్నికల సమయంలో తల్లి కాంగ్రెస్‌, పిల్ల కాంగ్రెస్‌ అంటూ విమర్శించిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు తల్లి కాంగ్రెస్ తో అంటకాగాలని చూస్తున్నారని రోజా దుయ్యబట్టారు. అయితే వచ్చే ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని రోజా స్పష్టం చేశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+