ఘరానా లేడీ: గోల్డ్ క్వెస్ట్ పుష్ప అప్పలనాయుడు అరెస్టు

ఆమెను నెల్లూరు జిల్లా కావలిలో సిఐడి అధికారులు అరెస్టు చేసి కృష్ణా జిల్లా విజయవాడకు తీసుకుని వచ్చారు. ఆమెపై కష్ణా జిల్లాలో రెండు కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలో కూడా కేసులు ఉన్నట్లు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఆమె మోసాలకు పాల్పడినట్లు సమాచారం.
గతంలో పుష్పా అప్పలనాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఆమె కోర్టుకు హాజరు కాకుండా ఎగవేస్తూ వస్తున్నారు. దీంతో సిఐడి పోలీసులు ఇంటర్‌పోల్ సాయం తీసుకున్నారు. గతంలో ఆమె నుంచి పోలీసులు 6 కిలోల బంగారం నాణేలను, కొన్ని కిలోలో వెండి నాణేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్మును ఆమె మలేసియాకు తరలించినట్లు చెబుతున్నారు. శుక్రవారంనాడు ఆమె చెన్నై నుంచి మలేసియాకు పోరిపోయే ప్రయత్నంలో ఉండగా సిఐడి అధికారులు పట్టుకున్నారు. ఆమెను పోలీసులు విజయవాడ కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆమెను రెండు రోజుల పాటు సిఐడి కస్టడీకి అప్పగించింది.












Click it and Unblock the Notifications