బూట్ల సోల్ కింద: బంగారానికి వెండి పూత (పిక్చర్స్)

హైదరాబాద్: అక్రంగా బంగారాన్ని తరలిస్తూ మంగళవారం ఐదుగురు ప్రయాణికులు కస్టమ్స్ అధికారులకు చిక్కారు. వారి నుంచి రూ. 52.12 లక్షల విలువ చేసే కిలో 700 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం జే.నరేష్‌ లక్ష్మణ్‌దాస్, కమలేష్‌ భగవాన్‌ దాస్‌లు రూ.20.54 లక్షల విలువ చేసే 686 గ్రాముల బంగారాన్ని తెస్తూ పట్టుబడ్డారు.

సయ్యద్ రిజ్వాన్ ఉస్మాన్ వద్ద రూ. 13.91 లక్షల విలువ చేసే 449 గ్రాములు, మహ్మద్ ఇస్తాపుద్దీన్ వద్ద రూ.9.05 లక్షల విలువ చేసే 292 గ్రాములు, మహ్మద్ ముస్తాపుద్దీన్ వద్ద రూ. 9.08 లక్షల విలువ చేసే 293 గ్రాముల బంగారం పట్టుబడింది. ఈ ముగ్గురు బంగారాన్ని గొలుసుల రూపంలో చేయించి వెండిపూత వేయించారు.

ముంబైకి చెందిన ఇద్దరు ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు ఆపి, తినిఖీ చేయగా బూట్ల సోల్ కింద బంగారాన్ని తెచ్చినట్లు తేలింది. వీరిద్దరు ముంబైకి చెందినవారు. వారు బ్యాంగ్‌కాక్ నుంచి వస్తూ పట్టుబడ్డారు.కస్టమ్స్ అధికారులు మంగళవారంనాడు మొత్తం 1.705 కిలోల బంగారాన్ని ఐదుగురు ప్రయాణికుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.52 లక్షల 12 వేల 361 రూపాయలు ఉంటుందని అంచనా వేశారు.

బంగారానికి వెండిపూత..

బంగారానికి వెండిపూత..

బంగారం గొలుసులకు వెండిపూత పూసి అక్రమంగా తరలిస్తూ ప్రయాణికులు మంగళవారం కస్టమ్స్ అధికారులకు చిక్కారు. Shamshabad Airport Gold Seized (1).jpg

దుబాయ్ నుంచి..

దుబాయ్ నుంచి..

దుబాయ్ నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికులను మంగళవారం ఉదయం కస్టమ్స్ అధికారులు ఆపి తనిఖీ చేయగా వెండి పూత పూసిన బంగారం గొలుసులు దొరికాయి.

బూట్ల సోల్ కింద..

బూట్ల సోల్ కింద..

ముంబైకి చెందిన ఇద్దరు ప్రయాణికులు దుబాయ్ నుంచి వస్తూ బూట్ల సోల్ కింద బిస్కట్ల రూపంలో బంగారాన్ని తెస్తూ దొరికిపోయారు. Shamshabad Airport Gold Seized

ముడి బంగారం చేతి గొలుసు

ముడి బంగారం చేతి గొలుసు

ఇద్దరు ప్రయాణికులు ముడి బంగారం గొలుసులను, ముడి బంగారం చేతి గొలుసులను ధరించి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు.

గొలుసల రూపంలో..

గొలుసల రూపంలో..

శంషాభాద్ విమానాశ్రయానికి ఆభరణాల రూపంలో కొంత మంది బంగారాన్ని అక్రమంగా తీసుకుని వస్తూ పట్టుబడ్డారు.

బూట్లను పరిశీలిస్తున్న అధికారులు

బూట్లను పరిశీలిస్తున్న అధికారులు

అనుమానం వచ్చి కస్టమ్స్ అధికారులు బాట్లను విడిపించి, ఇద్దరు ప్రయాణికుల నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

బంగారం అక్రమ తరలింపు పట్టివేత

బంగారం అక్రమ తరలింపు పట్టివేత

కస్టమ్స్ అధికారులు మంగళవారంనాడు ఐదుగురు ప్రయాణికులను తనిఖీ చేసి, అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని పట్టుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+