జివోఎం డ్రాఫ్ట్‌లో పది భాగాలు: టికి కొత్త స్పీకర్, డిప్యూటీ
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో మంత్రుల బృందం (జివోఎం) కేబినెట్‌కు పలు ప్రతిపాదనలతో కూడిన నివేదికను ఇవ్వనున్న విషయం తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీకి తక్షణం కొత్త సభాపతిని, కొత్త డిప్యూటీ స్పీకర్‌ను నియమించాలని ప్రతిపాదనలో సూచించినట్లుగా తెలుస్తోంది. ముసాయిదాలోని కొన్ని అంశాలు వెలుగులోకి వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి.
వివరాల మేరకు... ముసాయిదా బిల్లులో పది భాగాలు ఉన్నాయి. ఒక్కో భాగంలో ఒక్కో అంశంపై చర్చించారు. మొదటి భాగంలో పీఠిక్, రెండో భాగంలో రాష్ట్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరణ, మూడో భాగంలో అసంబ్లీ సభ్యుల వివరాలు, పునర్వ్యవస్థీకరణ, నాలుగులో కొత్త హైకోర్టు ఏర్పాటు, ఆ తర్వాత రెండు విభాగాల్లో ఆస్తులు, అప్పులు, ఏడో విభాగంలో కార్పోరేషన్లు, ఎనిమిదో విభాగంలో ఆలిండియా రేడియో సర్వీసులు, తొమ్మిదో విభాగంలో నదీ జలాలు, బోర్డు, పదో విభాగంలో న్యాయపరమైన అంశాలు చర్చించింది.

తెలంగాణ అసెంబ్లీకి తక్షణం కొత్త స్పీకర్, కొత్త డిప్యూటీ స్పీకర్‌ను ఏర్పాటు చేయాలని, ఎక్కడి కార్పోరేషన్లు అక్కడే ఉంచాలని సూచించింది. ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టును అదే పేరుతో ఉంచి, తెలంగాణ హైకోర్టుకు హైకోర్టు ఆఫ్ తెలంగాణను సూచించింది.
హైకోర్టు న్యాయమూర్తులు ఎక్కడ కూర్చోవాలనే అంశంతో పాటు న్యాయమూర్తుల సంఖ్య అంశాన్నిరాష్ట్రపతికి వదిలేసింది. ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ పక్కన తెలంగాణ బార్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలి. కృష్ణా, గోదావరి జలాలపై నిర్మించిన ప్రాజెక్టులు జనాభా నిష్పత్తిలో పంపకం చేయాలి. నదీ నిర్వహణకు మండలి. పవర్ కార్పోరేషన్లు కేంద్రం సూచించే వరకు ఎక్కడివి అక్కడే ఉంటాయి. రెండు రాష్ట్రాలలో 371డిని కొనసాగించాలి.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications