త్వరలో సువర్ణయుగం: జగన్, షర్మిల రోడ్‌షో(పిక్చర్స్)

అనంతపురం/కర్నూలు: త్వరలోనే రాష్ట్రంలో సువర్ణయుగం రానుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం అనంతపురం జిల్లాలోని గుత్తిలో వైయస్సార్ జనభేరి సభలో ఆయన మాట్లాడుతూ.. మరో 25 రోజుల్లోనే మన తలరాతలు మార్చే ఎన్నికలు ఉన్నాయని చెప్పారు. పేదల గుండె చప్పుడు వినే నాయకుడినే ఎన్నుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

నోటికిచ్చిన హామీలను ఇస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును ప్రజలు నిలదీయాలని జగన్మోహన్ రెడ్డి అన్నారు. రూ. 2 బియ్యాన్ని రూ. 5.25కు ఎందుకు పెంచావని చంద్రబాబును నిలదీయాలని పిలుపునిచ్చారు. పేదలు వైద్యానికి ఆస్తులు తాకట్టుపెట్టే పరిస్థితిలో ఎందుకు ఆదుకోలేదని ప్రశ్నించాలని అన్నారు. పిల్లనిచ్చిన మామ ఎన్‌టి రామారావునే అధికారం కోసం వెన్నుపోటు పొడిచారని జగన్ ఆరోపించారు. సోమవారం ఆయన కర్నూలు జిల్లాలోని పత్తికొండలో పర్యటించారు.

కాగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ కృష్ణా జిల్లాలోని గన్నవరం, నూజివీడుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్ షోలో ఆమె మాట్లాడుతూ.. ప్రజల కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ తమదేనని ఆమె అన్నారు. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. ఇది ఇలా ఉండగా జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల ఖమ్మం జిల్లాలో పర్యటించారు. దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు పూర్తి స్థాయిలో అమలు కావాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని అన్నారు.

ప్రసంగిస్తున్న జగన్

ప్రసంగిస్తున్న జగన్

త్వరలోనే రాష్ట్రంలో సువర్ణయుగం రానుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి అన్నారు.

ముస్లిం కుటుంబంతో..

ముస్లిం కుటుంబంతో..

మంగళవారం అనంతపురం జిల్లాలోని గుత్తిలో వైయస్సార్ జనభేరి సభలో జగన్ మాట్లాడుతూ.. మరో 25 రోజుల్లోనే మన తలరాతలు మార్చే ఎన్నికలు ఉన్నాయని చెప్పారు.

ఓదారుస్తూ..

ఓదారుస్తూ..

పేదల గుండె చప్పుడు వినే నాయకుడినే ఎన్నుకోవాలని జగన్మోహన్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.

రోడ్‌షోలో అభివాదం

రోడ్‌షోలో అభివాదం

నోటికిచ్చిన హామీలను ఇస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును ప్రజలు నిలదీయాలని జగన్మోహన్ రెడ్డి అన్నారు.

విజయమ్మ రోడ్‌షో

విజయమ్మ రోడ్‌షో

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ కృష్ణా జిల్లాలోని గన్నవరం, నూజివీడుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్ షోలో ఆమె మాట్లాడుతూ.. ప్రజల కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ తమదేనని ఆమె అన్నారు.

షర్మిల ప్రసంగం

షర్మిల ప్రసంగం

జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల ఖమ్మం జిల్లాలో పర్యటించారు. దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు పూర్తి స్థాయిలో అమలు కావాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+