శుభవార్త: ఏపీలో మరోమారు తగ్గిన బియ్యం, కందిపప్పు ధరలు!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏపీలో మండిపోతున్న నిత్యవసర వస్తువుల ధరలను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. ఏపీలోని సామాన్య ప్రజలకు మరోమారు ధరలను తగ్గించి నిత్యావసరాలను అందుబాటులోకి తెస్తున్నట్టు ప్రకటించింది.

మళ్ళీ బియ్యం, కందిపప్పు ధరలను తగ్గించిన ఏపీ ప్రభుత్వం
ఇందులో భాగంగా ఇంతకుముందు పౌరసరఫరాల శాఖ పైన సమీక్ష నిర్వహించిన మంత్రి నాదెండ్ల మనోహర్ ఏపీలో బహిరంగ మార్కెట్లో కందిపప్పు, బియ్యం ధరలు మండిపోతుండగా ప్రభుత్వం తరఫున రెండు వస్తువులను తగ్గించిన ధరలపై పంపిణీ చేయాలని నిర్ణయించి రాయితీ కందిపప్పు, బియ్యం రైతు బజార్లలో అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇక తాజాగా మరోమారు నిత్యావసర వస్తువులైన బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం ధరలను మరో ఫా తగ్గించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ నిర్ణయించారు.

Good news Another reduction in the prices of rice and pulses in AP

తగ్గించిన ధరలివే
రైతు బజార్లలో కందిపప్పు కిలో 160రూపాయల నుంచి 150 రూపాయలకు, బియ్యం 48 రూపాయల నుంచి 47 రూపాయలకు స్టీమ్ బియ్యం 49 రూపాయల నుంచి 48 రూపాయలకు తగ్గించడంతో తగ్గించిన ధరలతో రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి రేపటి నుంచి విక్రయిస్తారని ఆయన పేర్కొన్నారు. దీనికి కావలసిన ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్లకు ఆదేశించానని ఆయన ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ లో షేర్ చేశారు.

నెల రోజుల్లో రెండు సార్లు కందిపప్పు, బియ్యం ధరల తగ్గింపు
రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నెల రోజులలో బియ్యం, కందిపప్పు ధరలను రెండుసార్లు తగ్గించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చిందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే గతంలో కందిపప్పు బియ్యం ధరలు బహిరంగ మార్కెట్లో 181 రూపాయలు పలుకుతున్న సమయంలో 160 రూపాయలకు విక్రయించాలని నిర్ణయించిన ప్రభుత్వం, ఇప్పుడు తాజాగా 150 రూపాయలకు విక్రయించాలని నిర్ణయించింది.

రేపటి నుండి రైతు బజార్లలో తగ్గించిన ధరలతో బియ్యం, కందిపప్పు
అంతేకాదు అప్పట్లో బహిరంగ మార్కెట్లో కిలో స్టీమ్డ్ బియ్యం 55 రూపాయల 85 పైసలు ఉన్న నేపథ్యంలో స్టీమ్డ్ బియ్యాన్ని 49 రూపాయలకే ఇవ్వాలని నిర్ణయించగా, ప్రస్తుతం ఆ ధర 48 రూపాయలకు తగ్గించారు. ఇక బియ్యాన్ని ఇంతకుముందు 48 రూపాయలకు ఇవ్వాలని నిర్ణయించగా ఇప్పుడు మళ్లీ 47 రూపాయలకు తగ్గించారు. ప్రస్తుతం తగ్గించిన ధరలతో ఈ నిత్యావసరాలు రేపటి నుంచి అన్ని రైతు బజార్లలోను ప్రత్యేక కౌంటర్లలో అందుబాటులో ఉంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+