రైతులకు తీపికబురు చెప్పిన చంద్రబాబు... పంటలకు ఆర్థిక సాయం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత అభివృద్ధితోపాటు సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ప్రధానంగా రైతులకు సంబంధించిన విషయాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రైతులెవరూ నష్టపోకూడదు అన్నదే ఆయన ఉద్దేశంగా ఉంది. ప్రకృతి విపత్తుల వల్ల నష్టం కలిగినా అందుకు బీమా చేయిస్తున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ఉద్యాన పంటలు సాగుచేసే రైతులను ప్రోత్సహించాలని, అందకవరమైన ఆర్థిక సాయాన్ని అందించాలనుకుంటోంది.

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంద్వారా..
ప్రస్తుతం రైతులు వరి, మొక్కజొన్న లాంటి సాంప్రదాయ పంటలే ఎక్కువగా సాగుచేస్తున్నారు. వీరిని లాభాలు ఎక్కువ.. ఖర్చు తక్కువగా ఉండే ఉద్యాన పంటలు వేసేలా ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. గత ప్రభుత్వం ఉద్యానపంటలను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పథకాన్ని ఉద్యాన పంటలకు అనుసంధానం చేస్తే రెండువిధాలుగా లాభం ఉంటుందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంద్వారా ఈ పంటలకు ఆర్థికంగా సహాయం అందించనున్నారు. అంతేకాదు.. అన్నదాతలకు రాయితీ కూడా ఇవ్వబోతున్నారు. పంటలు సాగుచేసేందుకు అవసరమైన మొక్కలను కూడా తక్కువ ధరకే అందిస్తారు.

good news AP government to provide financial assistance to farmers cultivating horticulture crops

విధివిధానాలను రూపొందిస్తున్న ప్రభుత్వం
అందరు రైతులను ఈ పంటవైపు ప్రోత్సహించడం కాకుండా ప్రభుత్వం కొన్ని విధివిధానాలను రూపొందిస్తోంది. ఐదు ఎకరాల్లోపు భూమి ఉండే చిన్న, సన్నకారు రైతులను లబ్ధిదారులుగా చేర్చనున్నారు. వీరికి సాగునీరు అందుబాటులో ఉండాలి. అలాగే వారి పొలాలకు విద్యుత్తు సరఫరా ఉండటంతోపాటు బోరు, పట్టాదారు పాసుపుస్తకం, 1బీ ఉండాలి. ప్రభుత్వం అందించే పథకానికి అర్హులు అవునో? కాదో స్థానిక తహశీల్దారు నిర్ణయిస్తారు. ప్రభుత్వం దీనిపై త్వరలోనే ప్రకటన చేయబోతోంది. ఈలోగా రైతులు తమ పట్టాదారు పాసుపుస్తకంతోపాటు ఆధార్ కార్డు, రేషన్ కార్డుల్లాంటి పత్రాలను ఉపాధి హామీ పథకానికి సంబంధించిన అధికారులకు అందిస్తే అర్హత ఉందా? లేదా? అనేది వారి పరిశీలించి నిర్ణయాన్ని వెల్లడించారు. ఏయే పంటలు సాగుచేయాలనే విషయాలను త్వరలోనే ఏపీ ప్రభుత్వం ప్రకటించబోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+