దసరా, దీపావళికి శుభవార్త; ఆ వస్త్రాలపై 40శాతం డిస్కౌంట్. ఇక షాపింగ్ మొదలెట్టండి!
దసరా, దీపావళి పండుగ వేళ తెలుగు రాష్ట్రాల ప్రజలకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు శుభవార్తలు చెబుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో బతుకమ్మ సంబరాలను రాష్ట్రస్థాయిలో కొనసాగిస్తూ ప్రజలు సంతోషంలో ప్రభుత్వం భాగస్వామ్యం తీసుకుంటుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా దసరా నవరాత్రి ఉత్సవాలతో పాటు, విజయవాడ ఉత్సవ్ నిర్వహిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రజల సంతోషంలో భాగస్వామ్యం అవుతోంది.
ఏపీ ప్రభుత్వం శుభవార్త
ఈ పండుగ సీజన్లో పురస్కరించుకొని మరో శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేనేత వస్త్రాలపై 40 శాతం డిస్కౌంట్ ను ప్రకటించింది. ఈ ఆఫర్ ద్వారా చేనేత వస్త్రాల విక్రయాలు పెరిగి, నేత కార్మికులకు లాభాలు చేకూరడంతో పాటు, వినియోగదారులకు కూడా ప్రయోజనం కలుగుతుంది. ఇక ఇదే విషయాన్ని ఏపీ చేనేత మరియు జౌళి శాఖ మంత్రి సబిత వెల్లడించారు.

దసరా, దీపావళికి ఆప్కో ఆఫర్
ఈ దసరా, దీపావళి పండుగలకు ఆప్కో అందిస్తున్న ఆఫర్ ను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేనేత వస్త్రాల వాడకాన్ని ప్రోత్సహించాలని ఆమె ప్రజలకు తెలిపారు. ఆప్కో ఉత్పత్తుల వినియోగాన్ని పెంచడానికి ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అనేక కీలక చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర స్థాయిలోనూ, జాతీయ స్థాయిలోనూ చేనేత బజార్లను నిర్వహిస్తూ చేనేత వస్త్రాలను ప్రోత్సహిస్తోంది.
ప్రతి చేనేత కార్మికుడికి అదనంగా 3 వేల రూపాయల ఆదాయం
చేనేత కార్మికులకు చేయూతను అందించడానికి తమ వంతుగా కృషి చేస్తుంది. ఇదిలా ఉంటే ఇటీవల ఆప్కో సంస్థకు ఉత్పత్తులను సరఫరా చేసే సొసైటీలలో పనిచేసే చేనేత కార్మికులకు సంబంధించి జీతాలు, ప్రాసెసింగ్ చార్జీలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ప్రతి చేనేత కార్మికుడికి అదనంగా 3 వేల రూపాయల ఆదాయం లభిస్తుంది.
89 వేల మంది చేనేత కార్మికులకు లబ్ధి
ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చేనేత కార్మికుల జీవితాలలో వెలుగులు నిండుతున్నాయి అని, రాష్ట్రంలోని 89 వేల మంది చేనేత కార్మికులకు ప్రభుత్వ నిర్ణయంతో లబ్ధి చేకూరుతుందని మంత్రి సవిత వెల్లడించారు. చేనేత వస్త్రాల విక్రయాలను ప్రోత్సహించడానికి రాష్ట్రవ్యాప్తంగా ఎగ్జిబిషన్ లను నిర్వహిస్తున్నామని తెలిపారు. అంతేకాదు అందిస్తున్నామని ప్రస్తుతం ఆప్కో ద్వారా చేనేత వస్త్రాలను ఆఫ్లైన్, ఆన్లైన్ ద్వారా విక్రయిస్తున్నారని, డోర్ డెలివరీ ఫెసిలిటీని కూడా ఇటీవల ఆప్కో మొదలు పెట్టిందని మంత్రి సవిత పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications