భారత దేశం మొత్తానికి గుడ్ న్యూస్

రైల్వేలు సాధారణ ప్రజలతోపాటు కొన్ని వర్గాల ప్రజలకు శుభవార్త ను అందించాయి. అన్ని తరగతుల్లో ప్రయాణించేవారి సౌలభ్యం కోసం వివిధ రకాల రైళ్లను నడుపుతున్న భారతీయ రైల్వే తాజాగా కూలీలు, పేదల కోసం ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. వందే భారత్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏసీ బోగీలు లేకుండా కేవలం జనరల్, స్లీపర్ బోగీలతో వందే సాధారణ్ రైళ్లను కూడా సిద్ధం చేసింది. మరికొద్దిరోజుల్లోనే జనతా ఎక్స్ ప్రెస్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి.

వీటిల్లో 22 నుంచి 26 కోచ్ లు ఉంటాయి. కార్మికుల కోసమే ప్రత్యేకంగా నడుపుతారు. వారు ఏయే రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటారు? ఏయే రాష్ట్రాల నుంచి వలస వచ్చారు? ఏయే ప్రాంతాలకు వెళ్లాలి? అనే వివరాలను సేకరించిన రైల్వే అందుకనుగుణంగా జనతా రైళ్లను అందుబాటులోకి తెస్తోంది. 2024 నాటికి ఇవి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వీటిల్లో ఛార్జీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి.

good news for indian railways passengers

ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, పంజాబ్, అస్సాం, గుజరాత్, ఢిల్లీ మధ్య వీటిని నడపనున్నారు. అధిక సంఖ్యలో కార్మికులు, చేతివృత్తులవారు, కార్మికులు, ఇతర వ్యక్తులు ఈ రాష్ట్రాల నుంచి వచ్చి తిరిగి ఇంటికి వెళుతుంటారు. ఈ రైళ్లను పండుగలో నడిచే రైళ్లకు భిన్నంగా నడుపుతామని, ఏడాది పొడవునా వీటి ఆపరేషన్ కొనసాగుతుందని రైల్వే అధికారులు వెల్లడించారు. దీంతో పాటు జనరల్ కోచ్‌లలో ప్రయాణించే వారికి అతి తక్కువ ధరలకు ఆహారం, నీటిని అందించాలని రైల్వే ఇటీవల నిర్ణయించింది. తక్కువ ధరకే ఆహారం కోసం జనతా ఖానా పేరుతో జనరల్ కోచ్ లకు దగ్గరగా ఆయా రైల్వేస్టేషన్లలో ఇవి అందుబాటులో ఉంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+