ట్రైన్ టికెట్స్ పై అదిరిపోయే గుడ్ న్యూస్
రైలు ప్రయాణం అనగానే అందరూ టికెట్స్ ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటారు. కొన్నిసార్లు టికెట్స్ బుక్ అవనప్పటికీ బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు మాత్రం కట్ అవుతాయి. మరికొన్నిసార్లు సాంకేతిక కారణాలవల్ల కూడా డబ్బులు డెబిట్ అవుతుంటాయి. టికెట్ మాత్రం బుక్ కాదు. ఇలాంటి సందర్భాల్లో ఐఆర్సీటీసీ డబ్బులు వెనక్కి ఇస్తుందికానీ ఈ ప్రక్రియ చాలారోజులు పడుతుంది. తరుచుగా టికెట్లు బుక్ చేసుకునేవారికి ఈ సమస్య ఎదురవుతుంటుంది. త్వరలోనే దీనికి పరిష్కారం లభించబోతోంది.
ఇక నుంచి డబ్బులు డెబిట్ అయితే గంటల వ్యవధిలోనే నగదు వెనక్కి రానుంది. డబ్బులు వెనక్కి వచ్చే సమయంలో ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వస్తుండటంతో రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. డబ్బులు వెనక్కిచ్చే సమయాన్ని గణనీయంగా తగ్గించాలని రైల్వే బోర్డు అన్ని విభాగాలను ఆదేశించింది. ఐఆర్‌సీటీసీ, ఆ సంస్థకు ఐటీ సేవలందించే సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS) దీనిపైనే పనిచేస్తున్నాయి.

టికెట్లు బుక్ అవని సందర్భంలో తర్వాత రోజు నుంచి డబ్బులు వెనక్కిచ్చే ప్రక్రియను ఐఆర్సీటీసీ ప్రారంభిస్తోంది. దీనితర్వాత బ్యాంకులు, పేమెంట్ గేట్ వేలు ప్రారంభిస్తున్నారు. మొత్తంగా మూడు నుంచి నాలుగు రోజులు పడుతుంది. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు వినియోగించిన సందర్భాల్లో ఒక్కోసారి వారం రోజులు పడుతోంది.
టికెట్లు రద్దు చేసుకున్నవారికి, వెయిటింగ్ లిస్టులో ఉన్నవారి టికెట్లు రద్దయినా ఇదే పరిస్థితి. టీడీఆర్ విషయంలో ఇంకా ఎక్కువ జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం అన్ని పనులు ఆటోమేటిక్ గా జరుగుతున్న సమయంలో డబ్బులు వెనక్కివ్వడానికి ఎందుకు ఆలస్యం జరుగుతోందని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. దీంతో సత్వరమే డబ్బులు వెనక్కిచ్చే విషయంపై ఐఆర్సీటీసీ సీరియస్ గా దృష్టిసారించింది.












Click it and Unblock the Notifications