రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. స్పెషల్ ట్రైన్స్

వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ ప్రకటించింది. విశాఖపట్నం, విజయవాడ, నర్సాపూర్ నుంచి ఈ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. వాటి వివరాలు తెలుసుకుందాం.

* నెం. 08588 విశాఖపట్నం నుంచి బనారస్ వరకు మే 24 నుంచి జూన్ 14 వరకు అందుబాటులో ఉంటుంది. ప్రతి బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు విశాఖలో బయల్దేరి గురువారం సాయంత్రం 4.30 గంటలకు బనారస్ చేరుకుంటుంది. నాలుగు ట్రిప్స్ అందుబాటులో ఉన్నాయి.

* నెం. 08587 బనారస్ నుంచి విశాఖపట్నం వరకు మే 25 నుంచి జూన్ 15 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ప్రతి గురువారం సాయంత్రం 6.00 గంటలకు బనారస్‌లో బయల్దేరి శుక్రవారం రాత్రి 8.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. నాలుగు ట్రిప్స్ అందుబాటులో ఉన్నాయి.

 train

* ఈ ప్రత్యేక రైళ్లు సింహాచలం, కొత్తవలస, విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, రాయగడ, సింగాపూర్ రోడ్, మునిగూడ, కేసింగ, తిత్లాగఢ్, బాలంగిర్, బార్‌గఢ్ రోడ్, సంబాల్‌పూర్, ఝర్సుగూడ, రూర్కెలా, హతియా, రాంచీ, మురి, బార్కకన, లేథర్, దాల్తోన్‌గంజ్, గార్వారోడ్ జంక్షన్, దేహ్రీ, సాసారం, భభువా రోడ్, దీన్ దయాల్ ఉపాధ్యాయ, న్యూ వెస్ట్ క్యాబిన్, వారణాసి, బనారస్‌లో ఆగుతాయి.

* నెం. 07687 నర్సాపూర్ నుంచి యశ్వంత్‌పూర్ మధ్య మే 14, 21, 28 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3.10 గంటలకు నర్సాపూర్‌లో బయల్దేరి సోమవారం ఉదయం 10.50 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది. మొత్తం 3 సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.

* నెం. 07688 యశ్వంత్‌పూర్ నుంచి నర్సాపూర్ మధ్య మే 15, 22, 29 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ప్రతి సోమవారం మధ్యాహ్నం 3.50 గంటలకు యశ్వంత్‌పూర్‌లో బయల్దేరి మంగళవారం ఉదయం 8.30 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది. మొత్తం 3 సర్వీసులు దుబాటులో ఉన్నాయి.

* ఈ రైళ్లు పాలకొల్లు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, దొనకొండ, మార్కాపూర్ రోడ్, గిద్దలూరు, నంద్యాల, డోన్, అనంతపూర్, ధర్మవరం, పెనుగొండ, హిందూపూర్, యెలహంక రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.

* సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మీదుగా మరిన్ని వేసవి ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి వచ్చాయి.
* నెం. 07046 సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మీదుగా దిబ్రుగఢ్ వరకు మే 15, 22, 29 తేదీల్లో అందుబాటులో ఉంటాయి.
* నెం. 07047 దిబ్రుగఢ్ నుంచి విశాఖపట్నం మీదుగా సికింద్రాబాద్ వరకు మే 18, 25, జూన్ 1 తేదీల్లో అందుబాటులో ఉంటాయి.
* నెం. 07419 సికింద్రాబాద్ నుంచి దానాపూర్ వరకు మే 13, 20, 27 తేదీల్లో అందుబాటులో ఉంటాయి.
* నెం. 07420 దానాపూర్ నుంచి సికింద్రాబాద్ వరకు మే 15, 22, 29 తేదీల్లో అందుబాటులో ఉంటాయి.
* మహబూబ్‌నగర్, గోరఖ్‌పూర్ మధ్య 14 వీక్లీ సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి.
* నెం. 05303 గోరఖ్‌పూర్ నుంచి మహబూబ్‌నగర్ వరకు మే 13 నుంచి జూన్ 24 వరకు
* నెం. 05304 మహబూబ్‌నగర్ నుంచి గోరఖ్‌పూర్ వరకు మే 15 నుంచి జూన్ 26 వరకు అందుబాటులో ఉంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+