జియో సిమ్ వాడేవారికి గుడ్ న్యూస్

భారత టెలికాం రంగంలో రిలయన్స్ జియో సంచలనాలు సృష్టిస్తోంది. క్వాలిటీ నెట్వర్క్, అన్ లిమిటెడ్ బెస్ట్ ఆఫర్లతో వినియోగదారులకు చేరువైంది. జియో అందించే అత్యుత్తమ ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి.

జియో రూ.239 ప్లాన్: 5జీలో చౌకైన ప్లాన్. రీఛార్జిపై 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. రోజువారీ డేటా 1.5 జీబీ. ప్లాన్ ముగిసే సమయానికి 42 జీబీ డేటా అందుబాటులో ఉంటుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్ లతోపాటు అన్ లిమిటెడ్ కాలింగ్ ఉంది. జియోకు చెందిన అన్ని యాప్ ల్లో ఉచితంగా సభ్యత్వాన్ని తీసుకోవచ్చు.

good news for reliance jio customers

జియో రూ.589 ప్లాన్: 56 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్లాన్ వస్తోంది. వినియోగదారులు జియో సావ్న్ ప్రో, జియో యాప్‌లకు అపరిమిత కాలింగ్, ఉచిత సభ్యత్వాన్ని పొందుతారు. ప్రతిరోజు 2GB డేటా, 100 SMSలు లభిస్తాయి

జియో రూ.1,099 ప్లాన్: ఈ ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ కూడా వస్తుంది. ఈ ప్లాన్‌లో రోజుకు 2జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్ లు, అన్ లిమిటెడ్ కాలింగ్ పొందొచ్చు. వ్యాలిడిటీ 84 రోజులు.

జియో రూ.1,559 ప్లాన్: కంపెనీ వెబ్‌సైట్‌లోని వాల్యూ ప్లాన్ విభాగంలో జాబితా చేయబడింది. 24జీబీ డేటా, 3,600 ఎస్ఎంఎస్ లు, అన్ లిమిటెడ్ కాలింగ్, జియో యాప్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్ ఉంది. వ్యాలిడిటీ 336 రోజులు.

జియో రూ.Rs. 2,999 ప్లాన్: ఇది అత్యంత ఖరీదైన ప్లాన్. రోజుకు 2.5GB డేటా, 100 ఎస్ఎంఎస్ లు ఉంటాయి. వ్యాలిడిటీ 365 రోజులు. అన్ లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనం ఉంది.

గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని వారికి కూడా నాణ్యమైన, మెరుగైన సేవలను అందించేందుకు రిలయన్స్ జియో ఎయిర్ ఫైబర్ తీసుకొస్తోంది. దీనివల్ల మారుమూల ప్రాంతాలకు కిలోమీటర్ల కొద్దీ గోతులు తవ్వి వైరు లాగాల్సిన అవసరం ఉండదు. 5జీ టవర్ల నుంచి రోటర్లు, రిసీవర్లు డేటాను స్వీకరించి వినియోగదారుడికి చేరవేస్తాయి. జియో వాడే వినియోగదారుల సంఖ్యను రెట్టింపు చేయాలనే ఉద్దేశంతో సంస్థ ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగానే ఎయిర్ ఫైబర్ తీసుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+