భ‌క్తుల‌కు గుడ్‌న్యూస్‌..నేడు అక్టోబరు నెల‌ అంగప్రదక్షిణం టోకెన్ల కోటా విడుద‌ల‌..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఎంతో ప్ర‌సిద్ధిచెందిన పుణ్య‌క్షేత్రం.. ఇక్క‌డికి నిత్యం భ‌క్తులు తండోప‌తండాలుగా త‌ర‌లివ‌స్తుంటారు. తిరుమల స్వామివారి ద‌ర్శ‌నానికి వ‌చ్చే భ‌క్తుల‌కు ఆల‌య అధికారులు ఓ శుభ‌వార్త‌ను అందించారు. నేడు అక్టోబ‌ర్ నెల‌కు సంబంధించిన అంగ‌ప్ర‌ద‌క్షిణం కోటా టిక్కెట్ల‌ను ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఆల‌య అధికారులు తెలిపారు. నేటి ఉదయం ప‌ది గంటల స‌మ‌యంలో అంగ‌ప్ర‌ద‌క్షిణం టిక్కెట్ల‌ను విడుద‌ల చేయ‌నున్నారు.

ప‌ద‌కొండు గంట‌ల‌కు తిరుమల శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన అక్టోబరు నెల ఆన్ లైన్ కోటాను విడుద‌ల చేయ‌నున్నారు. వీటితో పాటు వృద్ధులు, న‌డ‌వ‌లేని వారు (దివ్యాంగులు), దీర్ఘ‌కాలిక వ్యాధుల‌తో బాధ‌ప‌డేవారు తిరుమల స్వామివారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా అక్టోబరు నెల ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను కూడా నేటి మధ్యాహ్నం మూడు గంట‌ల స‌మ‌యంలో టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

Good news for the devotees Today is the release of Angapradakshina Tokens for the month of October

అలాగే, వీటితో పాటు రేపు (జులై 24న) ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా కూడా విడుద‌ల చేయ‌నున్న‌ట్లు టీటీడీ తెలిపింది. అక్టోబరు నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను రేపు ఉద‌యం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నున్నారు.

తిరుమల, తిరుపతి దేవ‌స్థానంలో అక్టోబరు నెల గదుల కోటాను రేపు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయునంది. తిరుమ‌ల - తిరుప‌తి శ్రీవారి సేవ కోటా టికెట్ల‌ను ఈ నెల 27వ తేది ఉదయం 11 గంటలకు, న‌వ‌నీత సేవ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు, ప‌ర‌కామ‌ణి సేవ మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్న‌ట్లు అధికారులు తెలిపారు.

అక్టోబ‌ర్‌లో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు..

అక్టోబర్ నెల‌లో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ బ్ర‌హ్మోత్సవాలు అక్టోబ‌ర్ 4 వ తేది నుంచి 12వ తేదీ జ‌రుగుతాయి. ఈ బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా అక్టోబర్ 4 నుంచి 10వ తేదీ వరకు తిరుమ‌ల ఆల‌యంలో సుప్రభాత సేవ మినహా, మిగిలిన అన్ని ఆర్జిత సేవల్ని టీటీడీ రద్దు చేస్తున్న‌ట్లు పేర్కొంది. అక్టోబర్ 11, 12వ తేదీల్లో సుప్రభాత సేవతో పాటు మిగిలిన అన్ని ఆర్జిత సేవలు రద్దు కానున్నాయి.

అక్టోబర్ 3 నుంచి 13వ తేదీ వరకు అంగప్రదక్షిణ, వర్చువల్ సేవా దర్శనం టికెట్ల కూడా టీటీడీ ర‌ద్దు చేసింది. ఈ విష‌యాన్ని భక్తులు గమనించి టికెట్లు బుక్ చేసుకోవాల‌ని ఆల‌య అధికారులు కోరారు. ఇత‌ర పూర్తి స‌మాచారం కోసం అలాగే, తిరుమల శ్రీవారి భక్తులు శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌నుకుంటే మాత్రం టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ను https://ttdevasthanams.ap.gov.in సంద‌ర్శించ‌గ‌ల‌రు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+