Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఉత్తరాంధ్ర ప్రజలకు శుభవార్త.. భోగాపురం విమానాశ్రయంపై కేంద్రమంత్రి ఫుల్ ఫోకస్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన కేంద్రం ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధికి దోహదం చేస్తున్న విషయం తెలిసిందే . ముఖ్యంగా ఏపీలో విమానయాన రంగాన్ని జెట్ స్పీడ్ లో ముందుకు తీసుకువెళ్లే పనిలో బిజీగా ఉన్నారు కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు. ఇక తాజాగా ఉత్తరాంధ్ర వాసులకు శుభవార్త చెప్పారు.

భోగాపురం విమానాశ్రయ పనులు పరుగులు పెట్టిస్తున్న కేంద్ర మంత్రి
భోగాపురం విమానాశ్రయం పనులను త్వరితగతిన పూర్తిచేసి విమానాశ్రయ సర్వీసులను త్వరలోనే అందుబాటులోకి తీసుకురావడానికి యుద్ధ ప్రాతిపదికన పనులు చేయిస్తున్నారు. అనుకున్న గడువు కంటే ఆరు నెలలు ముందే పనులు పూర్తి చేసేలా నిర్మాణ పనులను పరుగులు పెట్టిస్తున్నారు. తాజాగా విజయనగరం జిల్లాలోని భోగాపురం విమానాశ్రయం పనులను కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు పరిశీలించారు.

Good news for the people of Uttarandhra Union Minister full focus on Bhogapuram Airport

నిర్మాణ పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి
త్వరలో విమానాశ్రయ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రతినెల నిర్మాణ పనులను భయంగా పరిశీలిస్తున్నట్టు పేర్కొన్నారు అంతర్జాతీయ ప్రమాణాలతో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతుందని ఆయన వెల్లడించారు ఈ విమానాశ్రయ అభివృద్ధి జరిగితే ఇక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలుగు వ్యాపారాలకు కూడా మేలు జరుగుతుందన్నారు. భోగాపురం లోని అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ నిర్మాణంతో విజయనగరం తో పాటు శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లాలు కూడా అభివృద్ధి చెందుతాయని ఆయన తెలిపారు.

దాదాపు 50 శాతం నిర్మాణ పనుల పూర్తి
నిర్మాణ పనుల్లో వేగం చూస్తే అనుకున్న సమయం కంటే ఆరు నెలల ముందే పూర్తవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పనులను పరుగులు పెట్టిస్తున్న అధికారులను సిబ్బందిని ఆయన అభినందించారు. ఇప్పటివరకు ఎయిర్పోర్ట్ పనులు దాదాపు 50 శాతం పూర్తయ్యాయని చెప్పారు . 16 నెలలలో ఎయిర్పోర్ట్ సేవలు అందుబాటులోకి వస్తాయని , రన్ వే నిర్మాణం 65. 53% పూర్తయిందని పేర్కొన్నారు .

2026 కల్లా భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి
మట్టి పనులు 99.35 శాతం పూర్తయ్యాయని కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. టెర్మినల్, ఏటీసీ భవనాలు, ఇతర పనుల పురోగతిని వివరించిన రామ్మోహన్ నాయుడు భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ పనుల వేగం పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. 2026 కల్లా భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తుందన్నారు. భూమి పూజ చేసిన సంవత్సరంలోపే ఎయిర్ పోర్టు పనులు సగం పూర్తి కాగా త్వరలోనే విమానాశ్రయం అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+