జియో గుడ్ న్యూస్..

కొత్త సిమ్ కార్డు తీసుకునే సమయంలో మన పుట్టినరోజు తేదీ లేదంటే పెళ్లిరోజు లేదంటే మనకు నచ్చిన అంకెలు ఉండాలని అందరూ కోరుకుంటారు. అయితే చాలా సమయాల్లో అటువంటి అవకాశం లభ్యమవదు. రిలయన్స్ జియో కొత్తగా తన వినియోగదారులకు ఛాయిస్ నెంబర్ పేరుతో స్కీం తీసుకువచ్చింది. మనకు నచ్చిన నెంబరుతో సిమ్ కార్డు తీసుకునే సౌకర్యాన్ని కల్పించింది.

టెలికాం ఆపరేటర్ ఇచ్చిన నెంబరునే ఇప్పటివరకు మనం ఎంచుకునే సౌలభ్యం ఉండేది. కానీ జియో నెంబరు చివరి 4 అంకెలు లేదంటే 5 అంకెలు నచ్చినవి ఎంచుకోవచ్చు. వొడాఫోన్ ఐడియా, BSNL మాత్రమే ఇలాంటి సౌకర్యాన్ని గతంలో అందించాయి. తాజాగా రిలయన్స్ జియో ఈ జాబితాలో చేరింది. నచ్చిన నెంబర్ ఎలా ఎంచుకోవాలో ఇప్పుడు చూద్దాం.

jio

* Jio.com వెబ్ సైట్ లోకి వెళ్లి సెల్ఫ్ కేర్ సెక్షన్ ఎంచుకోవాలి.
* Choice Number సెక్షన్‌లోకి వెళ్లాలి.
* అప్పటికే మనం ఉపయోగిస్తున్న జియో నెంబరును ఎంటర్ చేస్తే ఆ నెంబరుకు ఒక ఓటీపీ వస్తుంది.
* ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత పిన్ కోడ్, పేరు చూపిస్తుంది. అందులో మనకు నచ్చిన నాలుగు లేదా ఐదు అంకెల్ని ఎంటర్ చేసి.. Show Available Numbers పై క్లిక్ చేయాలి.

* మీ పిన్ కోడ్ ఆధారంగా కొన్ని ఫోన్ నంబర్లను చూపిస్తుంది.
* వాటిల్లో మనకు నచ్చిన నెంబర్‌ను ఎంచుకొని Proceed పై క్లిక్ చేయాలి.
* తర్వాత స్క్రీన్‌పై ఉన్న Pay Now ఆప్షన్‌ను క్లిక్ చేసి డబ్బులు కట్టాలి.
* పేమెంట్ పూర్తయిన తర్వాత 15 రోజుల్లోగా మీకు నచ్చిన అంకెలతో సిమ్ కార్డు యాక్టివ్ అవుతుంది.
మొబైల్ ఫోన్‌లోని MyJio App ద్వారా కూడా పైన చెప్పినట్లుగా నెంబర్ ను ఎంపిక చేసుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+