చంద్రబాబును పెళ్ళికొడుకును చేసింది దాసరి, ఆ ఇంట్లోనే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును పెళ్ళికొడుకును దర్శకరత్న దాసరినారాయణరావు ఇంట్లోనే చేసినట్టు నటుడు మోహన్ బాబు చెప్పారు. దాసరితో చంద్రబాబునాయుడుకు మంచి సంబంధాలున్నాయని ఆయన గుర్తుచేసుకొన్నారు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును పెళ్ళికొడుకును దర్శకరత్న దాసరినారాయణరావు ఇంట్లోనే చేసినట్టు నటుడు మోహన్ బాబు చెప్పారు. దాసరితో చంద్రబాబునాయుడుకు మంచి సంబంధాలున్నాయని ఆయన గుర్తుచేసుకొన్నారు.

దర్శకరత్న దాసరినారాయణరావుతో సినీ నటుడు మోహన్ బాబు ఆంధ్రజ్యోతికి ఇంటర్వ్యూ ఇచ్చారు. దాసరి చనిపోయిన విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఫోన్ చేసి చెప్పినట్టుగా ఆయన గుర్తుచేసుకొన్నారు.

dasari narayana rao

చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడ ఆయన తన కార్యక్రమాలను రద్దుచేసుకొని దాసరి భౌతికకాయం వద్ద నివాళులర్పించేందుకు వచ్చాడని మోహన్ బాబు చెప్పారు.దాసరితో తనతో పాటు చంద్రబాబుకు ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తుచేసుకొన్నారు.

చంద్రబాబునాయుడుకు తానే దాసరిని పరిచయం చేసినట్టు ఆయన చెప్పారు. శివరంజని సినిమా ఫంక్షన్ తిరుపతిలో జరిగిన సమయంలో చంద్రబాబునాయుడు ఎమ్మెల్యేగా ఉన్నారని ఆయన చెప్పారు. ఆ ఫంక్షన్ లోనే దాసరిని చంద్రబాబుకు పరిచయం చేసినట్టు ఆయన చెప్పారు.అప్పటికే తనకు బాబు స్నేహితుడని చెప్పారు. అంతేకాదు ఆయనతో తనకు బంధుత్వం కూడ ఉందని చెప్పారు.

చంద్రబాబునాయుడిని పెళ్ళికొడుకును చేసింది కూడ దాసరినారాయణరావు ఇంట్లోనే అని ఆయన చెప్పారు.ఆనాడు ఎన్టీఆర్ ఇంటి ఎదురుగానే దాసరి ఇల్లు ఉండేదని ఆయన చెప్పారు. చంద్రబాబును పెళ్ళికొడుకుని చేసింది దాసరి పద్మ అని చెప్పారు. దాసరి ఇంట్లోనే ఈ శుభకార్యం జరిగిందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+