గుడ్‌న్యూస్.. జన్మభూమి ఎక్స్ ప్రెస్ పునరుద్ధరణ

విజయవాడ డివిజన్‌లో ఆధునికీకరణ పనుల కారణంగా కొన్ని రైళ్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. వీటిల్లో లింగంపల్లి నుంచి విశాఖపట్నం వరకు నడిచే జన్మభూమి ఎక్స్ ప్రెస్, విజయవాడ నుంచి విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగించే రత్నాచల్, గుంటూరు నుంచి విశాఖపట్నం మధ్య నడిచే సింహాద్రి వంటి ముఖ్యమైన రైళ్లు కూడా ఉన్నాయి. అయితే ప్రయాణికుల నుంచి తీవ్రమైన విమర్శలు రావడంతో దక్షిణ మధ్య రైల్వే జన్మభూమి ఎక్స్ ప్రెస్ ను పునరుద్ధరించింది.
విశాఖ-లింగంపల్లి (12805) యథావిధిగా నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు.

విజయవాడ- కాకినాడ పోర్ట్‌-విజయవాడ, చెంగల్పట్టు-కాకినాడ పోర్ట్-చెంగల్పట్టు రైళ్లను మళ్లీ అందుబాటులోకి తెచ్చారు. నిడదవోలు-కడియం మధ్య ఆధునికీకరణ పనుల కారణంగా జూన్‌ 23 నుంచి ఆగస్టు 11 వరకు పలు రైళ్లను ఇటీవల రద్దు చేశారు. ఈ నిర్ణయంపై ప్రయాణికుల నుంచి ఆందోళన వ్యక్తమైంది. ఈ క్రమంలో విశాఖ- లింగంపల్లి (12805) మధ్య నడిచే జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ను 25వ తేదీ నుంచి యథావిధిగా నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. వీటితో పాటు రద్దీని తగ్గించేందుకు తీసుకొచ్చిన ప్రత్యేక రైళ్లను మరికొన్ని రోజులు నడపనున్నారు.

Goodnews restarted of lingampalli to visakhapatnam Janmabhoomi Express

07605 తిరుపతి-అకోలా (శుక్రవారం) జులై 5 నుంచి సెప్టెంబరు 27 వరకు
07606 అకోలా-తిరుపతి (ఆదివారం) జులై నుంచి సెప్టెంబరు 29 వరకు
07609 పూర్ణ-తిరుపతి (సోమవారం) జులై 1వ తేదీ నుంచి సెప్టెంబరు 30వ తేదీ వరకు
07610 తిరుపతి-పూర్ణ (మంగళవారం) జులై 2వ తేదీ నుంచి అక్టోబరు 1వ తేదీ వరకు
07631 హైదరాబాద్-నరసాపూర్ (శనివారం) జులై 6వ తేదీ నుంచి సెప్టెంబరు 28వ తేదీ వరకు
07632 నరసాపూర్-హైదరాబాద్ (ఆదివారం) జులై 7వ తేదీ నుంచి సెప్టెంబరు 29వ తేదీ వరకు
07481 తిరుపతి-సికింద్రాబాద్ (ఆదివారం) జులై 7వ తేదీ నుంచి సెప్టెంబరు 29వ తేదీ వరకు
07482 సికింద్రాబాద్-తిరుపతి (సోమవారం) జులై 8వ తేదీ నుంచి సెప్టెంబరు 30వ తేదీ వరకు
07445 కాకినాడటౌన్-లింగంపల్లి (సోమ, బుధ, శుక్ర) జులై 1వ తేదీ నుంచి సెప్టెంబరు 30వ తేదీ వరకు
07446 లింగంపల్లి-కాకినాడటౌన్ (మంగళ, గురు, శని) జులై 2వ తేదీ నుంచి అక్టోబరు 1వ తేదీ వరకు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+