జగన్ లాంటి వారు ఉంటే అంతే!: గోరంట్ల తీవ్ర వ్యాఖ్య
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పైన, ఆ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ఏపీ శాసన సభలో అధికార పార్టీ సభ్యులు, మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ లాంటి వారు ఉంటే ఇక సమావేశాలేం జరుగుతాయని గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు.
సభా సమయాన్ని వృధా చేసేందుకు ప్రయత్నం చేస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. త్వరలోనే డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. కాగా, తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని వైసీపీ వాకౌట్ చేసింది.

మంగళవారం ఉదయం ప్రారంభమైన ఏపీ శాసన సభ పలుమార్లు వాయిదా పడింది. డ్వాక్రా రుణమాఫీపై చర్చ చేపట్టాలంటూ వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగడంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. తీర్మానం తిరస్కరణకు గురైన తర్వాత ఎలా చర్చిస్తారని ప్రశ్నించారు. సభ్యులు కొత్త సంప్రదాయాన్ని తెరపైకి తేవొద్దని స్పీకర్ సూచించారు.
మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. వైసీపీ సభ్యులు కొత్త సంప్రదాయాన్ని తెరపైకి తెస్తున్నారన్నారు. దీన్ని స్పీకర్ నిరోధించాలన్నారు. ఎలాంటి సమస్యలైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రజలు నమ్మకంతో ఉన్నారన్నారు. అయినా వైసీపీ సభ్యులు తమ పట్టు వీడకపోవడంతో సభ రెండుమార్లు వాయిదా పడింది.












Click it and Unblock the Notifications