జగన్ దారిలో బిజెపి: సోము వీర్రాజుపై గోరంట్ల ఫైర్, వివాదాస్పదం

బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై మాజీ మంత్రి టిడిపి సీనియర్ నాయకుడు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర ఆగ్రహన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్దిని అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారన

రాజమండ్రి: బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై మాజీ మంత్రి టిడిపి సీనియర్ నాయకుడు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర ఆగ్రహన్ని వ్యక్తం చేశారు.ఉపాధి హమీ పథకంలో అవినీతి జరిగిందని సోము వీర్రాజు కేంద్రానికి ఫిర్యాదు చేయడాన్ని గోరంట్ల బుచ్చయ్య చౌదరి తప్పుబట్టారు.

ఉపాధి హమీ పథకం పనుల్లో అవినీతి చోటుచేసుకొందని కేంద్రానికి గతంలోనే వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. దీంతో ఉపాధి హమీ పథకం నిధులు ఏపీ రాష్ట్రానికి నిలిచిపోయాయి. నిబంధనలకు విరుద్దంగా ఈ పనులను నిర్వహిస్తున్నారని వైసీపీ ఎంపీలు కొన్ని సాక్ష్యాలను కేంద్రానికి సమర్పించారనే ప్రచారం ఉంది.

Recommended Video

    Dr APJ Abdul Kalam Pratibha Puraskarams to 6500 meritorious students | Oneindia Telugu

    ఉపాధి పనులు చేసిన కూలీలకు డబ్బులు అందడం లేదు. దీంతో కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఉపాధి కూలీలకు డబ్బులు రాకుండా వైసీపీ నేతలు అడ్డుకొన్నారని గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని టిడిపి నిర్ణయం తీసుకొంది.

    ఉపాధి పనుల్లో అవకతవకలు చోటుచేసుకొంటున్నాయని బిజెపి సీనియర్ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూడ కేంద్రానికి ఫిర్యాదు చేయడం టిడిపి వర్గాల్లోను ఆందోళనకు గురిచేస్తోంది.

    సోము వీర్రాజు ఫిర్యాదు

    సోము వీర్రాజు ఫిర్యాదు

    ఉపాధి హమీ పనుల్లో అవినీతి చోటుచేసుకొందని బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఫిర్యాదు చేయడం టిడిపి నాయకత్వానికి మింగుడు పడడం లేదు. ఇదే విషయమై ఇప్పటికే వైసీపీ చేసిన ఫిర్యాదుపై రాజకీయంగా ఆ పార్టీని ఇరుకున పెట్టేందుకు టిడిపి ప్రయత్నిస్తోంది. అయితే అదే తరుణంలో బిజెపి సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ సోము వీర్రాజు కేంద్రానికి ఫిర్యాదు చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.

    సోము వీర్రాజుపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహం

    సోము వీర్రాజుపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహం

    బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఫైర్ అయ్యారు. ఉపాధి హామీ పథకంలో అవినీతి జరిగిందంటూ కేంద్ర ప్రభుత్వానికి సోము వీర్రాజు చేయడం సరికాదని బుచ్చయ్యచౌదరి అన్నారు. ఓవైపు మితృత్వం కొనసాగిస్తూనే బీజేపీ నేతలు ఇలా వ్యవహరించడం ఎంతమాత్రం సబబని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు.

    వైసీపీ తరహలోనే బిజెపి కూడ

    వైసీపీ తరహలోనే బిజెపి కూడ

    వైసీపీ తరహాలో సోము వీర్రాజు కూడా రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి బిజెపిపై సీరియస్ అయ్యారు. రాష్ట్రం అభివృద్ది చెందడం ఇష్టం లేని వారే ఈ రకంగా కేంద్రానికి ఫిర్యాదులు చేస్తున్నాని గొరంట్ల బుచ్చయ్య చౌదరి అభిప్రాయపడ్డారు.

    టిడిపిపై తొలి నుండి వీర్రాజు ఇలానే

    టిడిపిపై తొలి నుండి వీర్రాజు ఇలానే


    టిడిపి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై బిజెపి నేత సోము వీర్రాజు మొదటి నుండి ఇలానే వ్యవహరిస్తున్నారు. వైసీపీ కంటే కూడ కొన్ని సమయాల్లో వీర్రాజు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే ఎమ్మెల్సీ పదవి కోసం కొంత కాలం పాటు విమర్శలు తగ్గించారనే ప్రచారం కూడ ఆయనపై వచ్చింది. అయితే తన సహజశైలికి భిన్నంగా మాత్రం తాను వ్యవహరించబోనని తాజాగా కేంద్రానికి ఫిర్యాదు చేయడం ద్వారా వీర్రాజు మరోసారి నిరూపించుకొన్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+