విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేంద్రంతో లాలూచీ , స్టీల్ ప్లాంట్ పై ఇక్కడ ఉత్తర కుమారుడిలా .. జగన్ పై గోరంట్ల బుచ్చయ్య సెటైర్లు

|
Google Oneindia TeluguNews

విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం మరోమారు స్పష్టం చేయడంతో రాష్ట్రంలో దుమారం రేగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కొనసాగుతున్న ఆందోళన పర్వం మరింత ఉధృతమైంది. తాజాగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో టిడిపి నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి వైసీపీ సర్కార్ ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు.

ఢిల్లీలో ఓకే సార్ అంటూ గంగిరెద్దుల్లా తల ఆడించటానికా ఇరవై ఎనిమిది మంది ఎంపీలు : లోకేష్ ధ్వజంఢిల్లీలో ఓకే సార్ అంటూ గంగిరెద్దుల్లా తల ఆడించటానికా ఇరవై ఎనిమిది మంది ఎంపీలు : లోకేష్ ధ్వజం

జగన్ పై సెటైర్లు వేసిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి

జగన్ పై సెటైర్లు వేసిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి

విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తున్నామని 100% పెట్టుబడులను ఉపసంహరించుకుంటామని పార్లమెంటు సాక్షిగా నిర్మలమ్మ వెల్లడించడంతో పాటు, సీఎం జగన్ మోహన్ రెడ్డితో చర్చించిన తర్వాత విశాఖ ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకుంటామని చెప్పడంపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి అసహనం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారం పై కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనతో ఉక్కు కార్మికులు తీవ్ర ఆగ్రహావేశాలకు లోనవుతున్నారు అని ఆయన అన్నారు.

ఇలాంటి లాలూచీ రాజకీయాలు దేనికి అని ప్రశ్నించిన గోరంట్ల

ఇలాంటి లాలూచీ రాజకీయాలు దేనికి అని ప్రశ్నించిన గోరంట్ల

రాష్ట్రంలో ఉన్న అసమర్ధ ముఖ్యమంత్రి సీఎం జగన్ స్టీల్ ప్లాంట్ కార్మికులతో, ఉద్యోగులతో ఎందుకు మాట్లాడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి లాలూచీ రాజకీయాలు దేనికి అని ప్రశ్నించారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. కేంద్రం దగ్గర సాగిలపడి రాష్ట్రంలో మాత్రం ఆపేస్తామని ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రాష్ట్ర బిజెపి నాయకులు కూడా దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

 వైసీపీ ఎంపీల పరిస్థితిపై , బీజేపీపై గోరంట్ల బుచ్చయ్య సెటైర్లు

వైసీపీ ఎంపీల పరిస్థితిపై , బీజేపీపై గోరంట్ల బుచ్చయ్య సెటైర్లు

కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామన్న వైసీపీ ఎంపీలు ఇప్పటివరకు కేంద్రం వద్దకు వెళ్లి ఒత్తిడికి లోనవడం తప్ప కేంద్రంపై ఒత్తిడి తెచ్చింది ఏమీలేదని, ఏం చేస్తాం మీ పరిస్థితి అలాంటిది అంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి వైసిపి ఎంపీలను ఎద్దేవా చేశారు. ఇక మాకు అవకాశం ఇస్తే మూడేళ్ల అమరావతి నిర్మాణం జరుగుతుందని చెబుతున్నారు బిజెపి నాయకుడు సోము వీర్రాజు ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ నమ్మకుండా ఆపండి తరువాత మిగతావి.. మా చెవిలో మీ పార్టీ గుర్తు పెట్టొద్దు జీ అని ప్రజలు అంటున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి బిజెపిని టార్గెట్ చేసి విమర్శించారు.

English summary
Gorantla butchaiah choudary, who was outraged that the incompetent Chief Minister of the state, CM Jagan, was not talking to the steel plant workers and employees, questioned why such lobbying politics. State BJP leaders also demanded to give an answer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X