బుచ్చయ్య..తగ్గేదేలే : 77వ ఏట తీన్మార్ స్టెప్పులతో - ఫుల్ మస్తీ : వీడియో వైరల్..!!

టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇప్పుడు సంచలనంగా మారారు. తన వయసు ఇంకా 77 మాత్రమే అంటున్నారు. ఏ మాత్రం జోష్ తగ్గలేదు. తన జన్మదిన వేడుకల్లో స్టెప్పులు వేసారు. ఫుల్ మస్తీ చేసారు. కార్యకర్తలతో కలిసి సందడిగా గడిపారు. బుచ్చయ్య చౌదరి 77వ జన్మదినం ఢిఫరెంట్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్ కు వీరాభిమాని అయిన బుచ్చయ్య పార్టీలో తొలి తరం నేత. ఎన్టీఆర్ పదవీచ్యుతుడు అయిన సమయంలోనూ ఆయన వైపే నిలిచారు. మంత్రిగానూ పని చేసారు. ఈ మధ్య కాలంలో జిల్లాలో పార్టీ ఆధిపత్య పోరుతో ఆయన ఒక దశలో పార్టీకి రాజీనామా చేస్తారనే ప్రచారం సాగింది. ఆ తరువాత చంద్రబాబు బుజ్జగింపులతో ఆయన వెనక్కు తగ్గారు.

ఇక, అసెంబ్లీలో పార్టీ సీనియర్ నేత ప్రభుత్వం పైన విరుచుకుపడటంలో ముందుంటారు. ఆయన సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటున్నారు. వైసీపీ పైన పంచ్ లు.. వ్యంగాస్త్రాలు సంధిస్తూ ఉంటారు. ఇక, ఆయన జన్మదినం కావటంతో నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలు, అభిమానుల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కార్యకర్తలు ఆయన్ను భుజాలపైకి ఎక్కించుకొని డాన్స్ చేసారు. ఆయన్ను డాన్స్ చేయమని కోరారు. అంతే..తగ్గేదేలే అంటూ బుచ్చయ్య స్టెప్పులు వేసారు. 77 ఏళ్ల వయసులో బుచ్చయ్య చౌదరి డాన్స్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టీడీపీ శ్రేణుల్లో సర్క్యులేట్ అవుతోంది.

TDP Sernior leader Gorantla Butchaih Chowdary teenmar steps became viral in social media.

ఆయన ఆ వసులోనూ ఏ మాత్రం ఎనర్జీ లెవల్స్ తగ్గకుండా డాన్స్ చేయటం ఇప్పుడు హైలైట్ అవుతోంది. బుచ్చయ్య చౌదరి తీన్మార్ స్టెప్పులు చూసిన టీడీపీ అభిమానులు..ఆయన ఎనర్జీ లెవల్స్ కు ఫిదా అవుతున్నారు. ఆయనకు మద్దతుగా పోస్టింగ్ లు పెడుతున్నారు. బుచ్చయ్య జన్మదినం కావటంతో ఆయన ఎన్టీఆర్ తో ఉన్న ఫొటోలను సైతం ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసారు. ఏ విషయం అయినా..ఉన్నది ఉన్నట్లుగా ముక్కుసూటిగా వ్యవహరించే బుచ్చయ్య చౌదరి ప్రస్తుతం సభలో ఉన్న సీనియర్లలో ఒకరు. ఆయన ప్రస్తుతం రాజమండ్రి రూరల్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. టీడీపీ వాయిస్ బలంగా వినిపించే నేతల్లో ఒకరుగా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+