"జగన్ లాంటి చెత్త నాయకుడు ఇంకెక్కడా లేడు.."
హైదరాబాద్ : ప్రత్యేక హోదా అంశం ఏపీ అసెంబ్లీని కుదిపేస్తోంది. కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూనే.. ప్యాకేజీని స్వీకరించడానికి టీడీపీ ప్రభుత్వం రెడీ అయిపోవడంతో.. వైసీపీ గట్టిగా ప్రతిఘటిస్తోంది. స్పీకర్ పోడియంను చుట్టుముట్టి సభను స్తంభించే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నేతలు.
ఇదిలా ఉంటే.. పదే పదే స్పీకర్ పోడియంను చుట్టుముట్టి సభా సాంప్రదాయాలకు కనీస గౌరవం ఇవ్వట్లేదని మండిపడుతున్నారు టీడీపీ నేతలు. రెండో రోజు అసెంబ్లీ సమావేశాల సందర్బంగా దీనిపై స్పందించిన అధికార పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వైసీపీ అధినేత జగన్ పై విమర్శల వర్షం కురిపించారు.

జగన్ లాంటి చెత్త నాయకుడిని దేశంలో మరెక్కడా చూడలేదంటూ బుచ్చయ్య చౌదరి తీవ్ర విమర్శలు చేశారు. జగన్ ఏవో మానసిక సమస్యలతో ఇబ్బందిపడుతున్నట్లున్నారని ఎద్దేవా చేశారు బుచ్చయ్య చౌదరి. పదే పదే స్పీకర్ పోడియాన్ని ముట్టడించి సమావేశాలకు అడ్డుపడడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన ఆయన.. వైసీపీ నేతలు మొండిగా వ్యవహరిస్తూ సభలో అరాచకం సృష్టిస్తున్నారని ఆరోపించారు.
ఇక కేంద్రం ఇచ్చే ప్యాకేజీ గురించి ప్రస్తావిస్తూ.. ప్యాకేజీ తీసుకుంటామని, అదే సమయంలో రాష్ట్ర ప్రయోజనాలపై కేంద్రంతో పోరాడుతామని స్పష్టం చేశారు బుచ్చయ్య చౌదరి.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications