'జగన్ 'బ్రాండెడ్ షర్ట్'లకు భలే గిరాకీ! నేను మాత్రం డిస్కౌంట్‌లో కొంటాను'
అసెంబ్లీ ఆవరణలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గురువారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన లాబీల్లో మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. గోరంట్ల ఈ రోజు చారల చొక్కా వేసుకొని వచ్చారు.
అమరావతి: అసెంబ్లీ ఆవరణలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గురువారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన లాబీల్లో మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. గోరంట్ల ఈ రోజు చారల చొక్కా వేసుకొని వచ్చారు.
ఆయన చారల చొక్కా వేసుకు రావడంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. అందుకు బుచ్చయ్య చౌదరి సమాధానం ఇచ్చారు. జగన్ అన్నీ బ్రాండెడ్ చొక్కాలు వేస్తారని, కానీ తాను డిస్కౌంట్ సేల్స్‌లోనే కొంటానని చెప్పారు. బ్రాండెడ్ షర్టులకు పెద్ద గిరాకీ ఉండదని చెప్పారు. డిస్కౌంట్ సేల్స్‌నే ప్రజలు ఆదరిస్తారన్నారు.

జగన్ నీళ్లను చూసి భయపడుతున్నారు
నీళ్లను చూసి ప్రతిపక్ష నేత జగన్ భయపడుతున్నారని కొవ్వూరు ఎమ్మెల్యే జవహర్ వ్యాఖ్యానించారు. పోలవరంపై చర్చ అంటే జగన్ ఎందుకు బయటకు వెళ్లారో చెప్పాలని నిలదీశారు.
జలసంరక్షణపై ప్రతిజ్ఞలో జగన్ పాల్గొనలేదన్నారు. జగన్‌కు జలం బదులు ధనం కనబడుతోందని ఎమ్మెల్యే జవహర్ ఎద్దేవా చేశారు. జగన్ హైడ్రో ఫోబియా, మనీ మేనియాలతో బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications