58మండలాలు: ఇదీ ఏపీ రాజధాని, సిటీ పరిధి, ఓర్వలేకే: నారాయణ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేపిటల్ రీజియన్, కేపిటల్ పరిధిని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో కృష్ణా, గుంటూరు జిల్లా పరిధిలోను పలు మండలాలు అందులో ఉన్నాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వం మంగళవారం నాడు ఆరు జీవోలను విడుదల చేసింది.
జీవో నెంబర్ 252 నుండి 257 వరకు జీవోలు విడుదలయ్యాయి. రాజధాని సరిహద్దు, నగర సరిహద్దును పేర్కొన్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ విడుదల చేసింది. క్యాపిటల్ ఏరిటా సరిహద్దులు, సిటీ సరిహద్దులు అందులో పేర్కొన్నారు.
క్యాపిటల్ ఏరియాలోని సీఆర్డీ పరిధిలోకి 58 మండలాలు వస్తాయి. సిటీ పరిధిలో 30 గ్రామాలు, మూడు మండలాలు ఉన్నాయి. కేపిటల్ ఏరియా పైన సర్వాధికారులు సీఆర్డీఏకు ఇచ్చారు. ప్రకాశం బ్యారేజీ వై జంక్షన్ నుండి మంగళగిరి వరకు కేపిటల్ రీజియన్. కేపిటల్ రీజియన్ 7068 కిలోమీటర్లు ఉంది. కేపిటల్ పరిధి 122 కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది.

కేపిటల్ రీజియన్ ఏరియాలో కృష్ణా జిల్లాలోని 29 మండలాలు, గుంటూరు జిల్లాలోని 29 మండలాలు వస్తాయి. మొత్తం 58 మండలాలు. ఇందులో కృష్ణా జిల్లాలో 11 మండలాలు, గుంటూరు జిల్లాలో 17 మండలాలు పూర్తిగా కలిపారు. దీని పరిధిలోని తుళ్లూరు మండలం లింగాయపాలెం, ఉద్దండరాయుని పాలెం, వెలగపూడి గ్రామాలను చేర్చారు. జీవో 252లో సీఆర్డీఏ యాక్ట్, జీవో 253లో సిటీ పరిధిని పేర్కొంది.
సీఆర్డీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్
సీఆర్డీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సభ్యుడిగా, సీఆర్డీఏ కమిషనర్ కమిటీ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. రాజధాని ప్రాంతంలో భూసమీకరణ చేయాలని సీఆర్డీఏను ప్రభుత్వం ఆదేశించింది. పదకొండు మందితో సీఆర్డీయే కమిటీని ఏర్పాటు చేశారు.
గెజిట్ విడుదల
నూతన రాజధాని కోసం ఉద్దేశించిన సీఆర్డీఏ నోటిఫికేషన్ చట్టరూపం దాల్చింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఏకగ్రీవంగా రూపొందించిన బిల్లుకు గవర్నర్ నరసింహన్ మంగళవారం ఆమోద ముద్ర వేశారు. బిల్లుపై సంతకం చేసి ఆ బిల్లును తిరిగి సెక్రటేరియట్‌కు పంపించారు.
గవర్నర్ ఆమోద ముద్ర పడడంతో సీఆర్డీఏ బిల్లును ప్రభుత్వం గెజిట్‌లో ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి తొలి అడుగు రేపు (బుధవారం) పడనుంది. రేపటి నుంచి రాజధాని ప్రాంతంలో భూసమీకరణకు రంగం సిద్ధమైంది. జిల్లాలోని జెడ్పీ సమావేశ మందిరంలో రెవెన్యూ సిబ్బందితో భూసేకరణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి సీఆర్‌డీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ శ్రీకాంత్ హాజరయ్యారు. భూసమీకరణకు నేడు నోటిఫికేషన్ విడుదల చేసి రేపటి నుంచి భూసమీకరణ చేపడతామని ఆయన తెలిపారు.
వెయ్యి నుంచి 1400 ఎకరాల భూమిని ఒక యూనిట్‌గా చేసి భూసమీకరణ చేయనున్నట్లు తెలిపారు. డిప్యూటీ కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగే ఈ ప్రక్రియలో ప్రతీ బృందంలో ఇద్దరు డిప్యూటీ తహశీల్దార్లు, సర్వేయర్లు ఉంటారని ఆయన తెలిపారు. రేపు సీసీఎల్‌ఏ నుంచి 27 బృందాలు రానున్నట్లు శ్రీకాంత్ వెల్లడించారు.
ఓర్వలేక తగులబెట్టారు: నారాయణ
రాజధాని ప్రాంతంలో పంటలు కాల్చివేయడం దురదష్టకరమన్నారు. అభివృద్ధిని ఓర్వలేకనే తగులబెట్టారన్నారు. ప్రపంచ అద్భుత రాజధాని తమ లక్ష్యమని చెప్పారు. ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ పైన రాజధాని ప్రాంత రైతులు సంతృప్తితో ఉన్నారని చెప్పారు. ప్రజలకు అనుకూలంగా ఉండే రాజధాని ఉంటుందన్నారు. అన్ని జిల్లాలకు మధ్యలో రాజధాని ఉంటుందని చెప్పారు. రైతులకు ఉదారంగా ప్యాకేజీ ఇచ్చామన్నారు.












Click it and Unblock the Notifications