హైదరాబాద్‌కు హంగు: రూ.4,051 కోట్లతో 20 మల్టీప్లైఓవర్లు, జంక్షన్లు

హైదరాబాద్: హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. నగరంలో అత్యంత రద్దీగా ఉండే 20 ముఖ్యమైన ప్రదేశాల్లో తొలిదశలో రోడ్ల విస్తరణ, బహుళస్థాయి వంతెనల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇందుకోసం రూ.4,051 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం హెచ్‌ఎంఎ 2041 స్టడీ రిపోర్ట్ ప్రకారం ఈ ప్రాజెక్టు రూపొందించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా స్కైవేలు, మేజర్ కారిడార్లు, రోడ్లు నిర్మిస్తారు.

Hyderabad

హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చే దిశగా ఈ నిర్మాణాలు ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 20 ప్రధాన ప్రాంతాలను గుర్తించి ఈ నిర్మాణాలు చేపట్టనున్నారు. డిజైన్, బిల్డ్ మేయింటెన్, అండ్ ట్రాన్స్‌ఫర్ (డిబిఎంటి) విధానంలో నిర్మాణాలు జరుపుతారు.

ఈ ప్రాజెక్టులో నిర్మాణానికి సంబంధించి భూమి సేకరణ, ఆస్తుల స్వాధీనం వంటి వాటిని వెంటనే చేపడతారు. డీబీఎంటీ విధానంలోనే త్వరలోనే టెండర్లు ఆహ్వానించనున్నారు. మొదటి దశ ప్రాజెక్టు వ్యయం రూ.4,051 కోట్ల అవుతుందని అంచనా వేశారు.

4,051 కోట్ల రూపాయల పనులకు సంబంధించి పరిపాలనా పరమైన అనుమతి మంజూరు చేయాలని జీహెచ్‌ఎంసీ కోరగా, ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. కేబీఆర్ పార్క్ 6 జంక్షన్ వద్ద మల్టీ లేవల్ ఫ్లై ఓవర్‌ను నిర్మిస్తారు.

రసూల్ పురా జంక్షన్, ఉప్పల్ జంక్షన్, ఓవైసి జంక్షన్ బయోడైవర్సిటీ జంక్షన్ నుంచి కూకట్‌పల్లి, బహద్దూర్ పురా జంక్షన్ వరకు ఫ్లై ఓవర్‌లను నిర్మిస్తారు. ఆబిడ్స్ జీపీఓ, చాదర్‌ఘాట్, మలక్‌పేటలోను నిర్మాణాలుంటాయి. రాష్ట్ర ప్రభుత్వం డీపీఎంటీ విధానంలో మొత్తం 20 ప్రాంతాల్లో ఫ్లై ఓవర్లు, జంక్షన్ల నిర్మాణానికి అనుమతించింది.

కేబీఆర్ పార్క్ ఎంట్రెన్స్, రోడ్డు నెంబర్ 12లోని మహారాజా అగ్రసేన్ జంక్షన్, క్యాన్సర్ ఆస్పత్రి జంక్షన్ , ఫిల్మ్ నగర్, రోడ్ నంబర్ 45జంక్షన్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, ఎల్‌బి నగర్, బైరామల్‌గుడా, కామినేని ఆస్పత్రి (ఎల్బీ నగర్), చింతలకుంట, రసూల్‌పురా, ఉప్పల్, ఓవైసీ ఆస్పత్రి, బయోడైవర్సిటీ పార్క్, అయ్యప్ప సొసైటీ, రాజీవ్ గాంధీ బొమ్మ జంక్షన్, బహద్దూర్‌పురా జంక్షన్, ఆబిడ్స్ జిపిఓ నుంచి చాదర్‌ఘాట్, మలక్‌పేట వరకు, సైబర్ టవర్ జంక్షన్, మైండ్ స్పేస్ ప్రాంతాలను గుర్తించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ఒక కమిటీని కూడా వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+