చంద్రబాబుకు గవర్నర్ ఫోన్: తీరప్రాంత పరిస్థితులపై ఆరా, ఉధృతంగా అలలు

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ బుధవారం సాయంత్రం ఫోన్ చేశారు. విశాఖ, శ్రీకాకుళంలోని సముద్ర తీరప్రాంత పరిస్థితులపై ఆయన ఆరా తీశారు.

తీరప్రాంతంలో విపరీత వాతావరణ పరిస్థితులపై ఫోన్‌లో అడిగి తెలుసుకున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధంగా ఉంచాలని, నిత్యావసర వస్తువులు, సహాయ సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.

 governor did a phone call to chandrababu

దక్షిణ మహాసముద్రంలో అల్పపీడన ప్రభావంతో బంగాళాఖాతం అల్లకల్లోలంగా తయారైంది. ఉత్తర కోస్తా సముద్రతీరంలో అలల ఉద్ధృతి పెరిగింది. కొన్ని చోట్ల బలమైన వేగంతో రెండు నుంచి నాలుగు మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడుతున్నాయి. ఇప్పటికే భారీగా అలలు ఎగసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో సంబంధిత అధికారులు అప్రమత్తమయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+