Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'తల్లికి వందనం' అమలు పై గవర్నర్ ప్రకటన - ఆ నిబంధన తొలిగించాం..!!

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆరంభమయ్యాయి. గవర్నర్ నజీర్ అహ్మద్ కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు సాధించిన విజయాలను ప్రస్తావించారు. గత ప్రభుత్వ వైఫల్యాల గురించి వివరించారు. ఏపీ భవిష్యత్ కోసం ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు. గత ఐదేళ్లలో రాష్ట్రం అనేక ఇబ్బందులకు గురైందని వ్యాఖ్యానించారు. పథకాల గురించి గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావన చేస్తూ తల్లికి వందనం అమలు పైన స్పష్టత ఇచ్చారు. సంక్షేమం - అభివృద్ధి కి కట్టుబడి ఉందని గవర్నర్ నజీర్ అహ్మద్ స్పష్టం చేసారు.

తల్లికి వందనం అమలు
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రసంగంలో గవర్నర్ నజీర్ అహ్మద్ కీలక అంశాలను ప్రస్తావిం చారు. కూటమికి ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ గురించి వివరించారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఎంతో నష్టపోయిందని చెప్పారు. సూపర్‌ సిక్స్‌ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నామని గవర్నర్ వివరించారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా తల్లికి వందన కింద ప్రతీ మహిళ కు రూ 15 వేలు ఇవ్వటంతో పాటుగా అన్ని హామీలు అమలవుతాయని చెప్పుకొచ్చారు. చెప్పినట్లు గానే అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ రద్దు చేశామన్నారు. అన్నక్యాంటీన్లు తెచ్చి పేదల ఆకలి తీరుస్తున్నామని అన్నారు.

Governor Nazeer Ahmed Announces Govt will implement all super six schemes in his Assembly Speech

2027కి పోలవరం
కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామని గవర్నర్ వివరించారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర కలను సాకారం చేస్తామని స్పష్టంచేశారు. ప్రతీ నెల 1నే ఇంటికి వెళ్లి లబ్ది దారుల కు పింఛన్లు అందిస్తున్నామన్నారు. పెన్షన్లు రూ. 4 వేలకు పెంచామని.. పేద విద్యార్ థులకు ఉపకారవేతనాలు, విద్య, వైద్యం అందజేస్తున్నామని వివరించారు. మౌలికవసతులపై ప్రత్యేక దృష్టి సారించామని వెల్లడించారు. బీసీ వర్గాల ఉన్నతి కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు ప్రకటించారు. స్థానికసంస్థలు, నామినేటెడ్‌ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించామన్నారు. ఏడాదికి 2 గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామన్నారు. పోలవరం ప్రాజెక్టును పట్టాలెక్కించామని 2027 కి పూర్తి చేస్తామని వెల్లడించారు.

ఆ నిబంధన తొలిగించాం
స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆగిపోయినట్లు గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. అర్హులైన పేద లందరికీ సొంతిల్లు ఉండాలనేది తమ ఆకాంక్ష అని చెప్పుకొచ్చారు. ఐటీ నుంచి ఏఐ రివల్యూషన్‌ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. సంక్షేమం, అభివృద్ధి సమన్వయం చేసుకుంటున్ నామని గవర్నర్‌ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో పోటీకి ఇద్దరు పిల్లలే ఉండాలన్న నిబంధన ఎత్తివేశామని తెలిపారు. రాష్ట్రంలో సూర్య ఘర్‌ యోజన కింద సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పా టు చేశామని, తమ ప్రభుత్వ చర్యలతో టూరిజంలో పెట్టుబడులు పెరిగాయన్నారు. రాష్ట్రానికి జరిగిన నష్టంపై 7 శ్వేతపత్రాల ద్వారా ప్రజలకు తెలియ చేసామన్నారు. గవర్నర్ ప్రసంగం సమయంలో ప్రతిపక్ష హోదా కోసం ఆందోళన చేసిన వైసీపీ.. ఆ తరువాత వాకౌట్ చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+