తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీవారి సేవలో నర్సింహన్: తనిఖీ, ప్రశంస(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

తిరుపతి: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నర్సింహన్ సోమవారం సాయంత్రం తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని సాధారణ భక్తులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ వేద పండితులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ ఎంజి గోపాల్, తిరుమల జెఈఓ కెఎస్ శ్రీనివాస రాజులు గవర్నర్ నర్సింహన్ వెంట ఉన్నారు. భక్తులకు సులభ దర్శనం కోసం కర్ర ప్లాట్ ఫాంలను మూడు భిన్న స్థాయిల్లో ఏర్పాటు చేసినట్లు వారు గవర్నర్‌కు తెలిపారు. ఆలయంలో కొత్తగా ప్రవేశపెట్టిన మూడు మెట్ల క్యూలైన్ పద్ధతిని నర్సింహన్ తనిఖీ చేశారు.

స్వామివారి దర్శనం అనంతరం గవర్నర్ నర్సింహన్‌కు వేద పండితులు వేదాశీర్వాదం అందించారు. అంతకుముందు స్వామివారి పుష్కరిణిలో గవర్నర్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బ్రహ్మోత్సవాలకు జరుగుతున్న ఏర్పాట్లను కూడా ఆయన పరిశీలించారు. ఆ తర్వాత వరాహస్వామిని దర్శించుకున్నారు. ఎస్పీలు గోపీనాథ్ జెట్టి, జి శ్రీనివాస్, ఆలయ డిప్యూటీ ఈఓ సి రమణలు కూడా గవర్నర్ వెంట ఉన్నారు.

ఈ సందర్భంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పోస్టర్లను గవర్నర్ ఆవిష్కరించారు. స్వామివారి దర్శనానికి వచ్చే సాధారణ భక్తుల కోసం ఆలయ అధికారులు తీసుకుంటున్న చర్యల పట్ల గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేసి, అధికారులను అభినందించారు.

గవర్నర్

గవర్నర్

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నర్సింహన్ సోమవారం సాయంత్రం తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని సాధారణ భక్తులతో కలిసి దర్శించుకున్నారు.

గవర్నర్

గవర్నర్

ఆలయ వేద పండితులు గవర్నర్ ఈఎస్ఎల్ నర్సింహన్‌కు ఘన స్వాగతం పలికారు.

గవర్నర్

గవర్నర్

తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ ఎంజి గోపాల్, తిరుమల జెఈఓ కెఎస్ శ్రీనివాస రాజులు గవర్నర్ నర్సింహన్ వెంట ఉన్నారు.

గవర్నర్

గవర్నర్

భక్తులకు సులభ దర్శనం కోసం కర్ర ప్లాట్ ఫాంలను మూడు భిన్న స్థాయిల్లో ఏర్పాటు చేసినట్లు వారు గవర్నర్‌కు తెలిపారు.

గవర్నర్

గవర్నర్

ఆలయంలో కొత్తగా ప్రవేశపెట్టిన మూడు మెట్ల క్యూలైన్ పద్ధతిని నర్సింహన్ తనిఖీ చేశారు.

గవర్నర్

గవర్నర్

స్వామివారి దర్శనం అనంతరం గవర్నర్ నర్సింహన్‌కు వేద పండితులు వేదాశీర్వాదం అందించారు. అంతకుముందు స్వామివారి పుష్కరిణి వద్ద ఏర్పాట్లను గవర్నర్ తనిఖీ చేశారు

గవర్నర్

గవర్నర్

ఈ సందర్భంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పోస్టర్లను గవర్నర్ ఆవిష్కరించారు.

గవర్నర్

గవర్నర్

స్వామివారి దర్శనానికి వచ్చే సాధారణ భక్తుల కోసం ఆలయ అధికారులు తీసుకుంటున్న చర్యల పట్ల గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేసి, అధికారులను అభినందించారు.

English summary

 Governor Sri ESL Narasimhan released the posters and invitations of Srivari Brahmotsavams 2014 in front of Srivari temple in Tirumala on Monday evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X