విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీకి మెగా పుడ్ పార్కు: మోడీని అలా కలిశాడు, ఇలా ప్రాజెక్టు వచ్చింది

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: సాగరమాల ప్రాజెక్టు కింద ఆంధ్రప్రదేశ్‌తో పాటు మహారాష్ట్రలో రెండు మెగా పుడ్ పార్క్ ప్రాజెక్టులను నెలకొల్పేందుకు కేంద్రం అంగీకరించింది. భారత ఆహార రంగంలో ఎగుమతి, దిగుమతి వాణిజ్య రంగాన్ని మరింతగా పెంచాలనే ఉద్దేశ్యంతో రూ. 324 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే ఈ పార్కులను చేపట్టనున్నట్టు నౌకాయాన మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

"నౌకాయాన శాఖ చేపట్టిన సాగరమాల ప్రాజెక్టు కింద దేశంలో రెండు మెగా ఫుడ్ పార్కులను ఏర్పాటు చేస్తున్నాం. సముద్ర తీరాలకు దగ్గరగా ఉన్న సెజ్‌లలో ఇవి ఉంటాయి. ఒకటి ఏపీలోని కాకినాడ ప్రాంతంలో ఇది ఏర్పాటవుతుండగా, రెండోది మహారాష్ట్రలో దక్షిణాన కొంకణ్ రీజియన్‌లో సతారా మెగా ఫుడ్ పార్క్ పేరిట ఏర్పాటు చేస్తున్నాం" అని కేంద్రం ఒక ప్రకటనలో పేర్కొంది.

Govt lines up Rs 324 crore to set up food parks in AP, Maharashtra

వైశాఖపట్నం - చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌లో ఏర్పాటవుతున్న ఈ మెగా ఫుడ్ పార్క్ నుంచి కాకినాడ ఓడరేవు ద్వారా విదేశాలకు ఎగుమతులు చేసే ఆలోచనలో ఉన్నామని అందులో పేర్కొంది. ఏపీలో నిర్మంచతలపెట్టిన ఈ పుడ్ ప్రాజెక్టుకు రూ. 184.88 కోట్లు వ్యయమవుతాయన్న అంచనాలు వేసింది.

ఇక మహారాష్ట్రలోని కొంకణ్ తీరంలోని మార్ముగావ్ పోర్టులో నిర్మించతలపెట్టిన ఈ పుడ్ ప్రాజెక్టుకు 139.33 కోట్లు కేటాయించామని, వచ్చే ఫిబ్రవరి నాటికి పూర్తవుతుందని పేర్కొంది. భారత్‌లో ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలకు ప్రపంచ వ్యాప్తంగా విక్రయాలు గణనీయంగా పెరుగుతున్న వేళ, ఈ రెండు ప్రాజెక్టులూ ప్రజల అవసరాలను తీర్చేందుకు దోహదపడనుంది.

దీంతో పాటు ఈ పుడ్ ప్రాజెక్టులు ద్వారా భారీ సంఖ్యలో కొత్త ఉద్యోగాల కల్పన జరుగుతుందని కేంద్రం అభిప్రాయపడుతోంది. దేశంలోని వివిధ పోర్టులను పారిశ్రామికవాడలుగా తీర్చిదిద్దడం వల్ల ఆహార రంగం మరింతగా అభివృద్ధి చెందుతుందని కేంద్రం భావిస్తోంది.

English summary
Government today said it is setting up two mega food parks at a cost of Rs 324 crore in Andhra Pradesh and Maharashtra under its ambitious Sagarmala project.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X