ఒంటిపూట బడుల వేళ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు..!!
తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రికార్డు ఉష్ణోగ్రతలతో ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో ఒంటి పూట బడులు కొనసాగుతున్నాయి. పరీక్షల కేంద్రాలుగా ఉన్న పాఠశాలల్లో మాత్రం వేళల్లో మార్పులు చేసారు. ఏప్రిల్ 24వ తేదీ వరకు ఒంటి పూట బడులు కొనసాగనున్నాయి. ఆ తరువాత జూన్ 12వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలోనే ఒంటి పూట బడులు అమలు చేస్తూనే విద్యా శాఖ తాజాగా అన్ని పాఠశాలలకు తాజా ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా నిర్ణయం
ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని పాఠశాలల్లో విద్యార్ధులు ఎవరూ డీహైడ్రేషన్‌కు గురికాకుండా వాటర్ బెల్ అమలు చేయాలంటూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఉత్తర్వులు జారీచేశారు. ప్రతి గంటకు ఒకసారి అంటే 10, 11, 12 గంటలకు వాటర్ బెల్ మోగించి, విద్యార్థులు తప్పనిసరిగా నీరు తాగేలా చూడాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే విద్యార్థులు తరగతి గదుల్లోకి తాగునీటి బాటిళ్లు తెచ్చుకునేందు కు అనుమతివ్వాలని ఆదేశించారు. వాటర్ బెల్ ఉత్తర్వులు అన్ని పాఠశాలలకు వర్తిస్తాయని స్పష్టంచేశారు.

ప్రభుత్వం ఉత్తర్వులు
ఇప్పటికే వేసవి తీవ్రత పెరుగుతోంది. దీంతో, విద్యార్ధులకు ఇబ్బంది లేకుండా ఒంటి పూట బడుల పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 24 వరకు ఒంటి పూట బడులు కొన సాగనున్నాయి. ఆ తరువాత జూన్ 12 వరకు వేసవి సెలవులు కొనసాగనున్నాయి. ఇప్పటికే విద్యా శాఖ అధికారులు వచ్చే విద్యా సంవత్సరం అకడమిక్ క్యాలెండర్ ఖరారు చేసారు. ఈ మేరకు పాఠశాల నిర్వహణ సమయాలను ఖరారు చేసారు. దీంతో, వేసవి సెలవుల వరకు ఒంటి పూట బడులు నిర్వహించనున్నారు. ఏపీ, తెలంగాణలో ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో అన్ని పాఠశాలలకు రోజురోజుకూ ఒంటిపూట బడులు నడపాలని విద్యాశాఖ నిర్ణయించింది.
ముందస్తు చర్యలు
ఈ సారి ఎండలు తీవ్రంగా ఉంటాయని వాతావర ణ శాఖ కూడా హెచ్చరిస్తోంది. ఎండల తీవ్రతను గుర్తించి విద్యార్ధులకు ఇబ్బంది లేకుండా అవస రమైన నిర్ణయాలు తీసుకోవాలని ఇప్పటికే విద్యా శాఖ కు ప్రభుత్వం స్పష్టం చేసింది. అందులో భాగంగానే విద్యార్ధులు డీహైడ్రేషన్ కు గురయ్యే అవకాశం ఉండటంతో.. విద్యార్ధులకు ఖచ్చితంగా మూడు వాటర్ బెల్స్ అమలు చేయాలని ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications