అసలు సిసలు తెలుగు తేజాలు- ఐరాసలో..
అమరావతి: ఆ పది మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు.. అసలు సిసలు తెలుగు తేజానికి ప్రతిరూపాలుగా నిలిచారు. ఏకంగా ఐక్యరాజ్యసమితిలో ఏర్పాటైన అత్యున్నత స్థాయి అంతర్జాతీయ సదస్సుకు ఏపీ తరఫున ప్రాతినిథ్యాన్ని వహించారు. తెలుగువారి ఘనతను ప్రపంచ దేశాలకు చాటి చెప్పారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవడమే ఓ శాపంగా భావించే పరిస్థితి నుంచి.. అందులో సీటు దక్కడమే అదృష్టంగా భావించే పరిస్థితి నెలకొంది ఏపీలో. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. నాడు- నేడు కింద ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను సమూలంగా మార్చేయడమే దీనికి ప్రధాన కారణం.

ఇంగ్లీష్‌లో విద్యాబోధన చేపట్టడం వల్ల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఏకంగా ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించే స్థాయికి ఎదగగలిగారు. సుస్థిర అభివృద్ధి, విద్య.. వంటి అంశాలపై అమెరికా న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో ఏర్పాటైన సదస్సులో వారు ప్రసంగించనున్నారు.
రాజేశ్వరి, జ్యోత్స్న, అంజన సాయి, గాయత్రి, శివలింగమ్మ, అమ్మాజాన్, మనస్విని, యోగీశ్వర్, రిషితారెడ్డి, చంద్రలేఖ.. అనే విద్యార్థులు ఇప్పటికే అమెరికాలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ నెల 28వ తేదీ వరకు అమెరికాలో జరిగే పలు కార్యక్రమాల్లో వారంతా భాగస్వామ్యులు కానున్నారు.
ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంక్, అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్, కొలంబియా విశ్వవిద్యాలయం వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలలో ఏర్పాటయ్యే సమావేశాల్లో తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. విద్యా రంగంలో రాష్ట్రంలో జరుగుతున్న విప్లవాత్మక కార్యక్రమాల గురించి వివరించనున్నారు.

వాషింగ్టన్ డీసీలో గల అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్ హౌస్‌ను సైతం వారు సందర్శించనున్నారు. ఇప్పటివరకు తాము పుట్టి, పెరిగిన గ్రామాలకు మాత్రమే పరిమితమైన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఇప్పుడు ఏకంగా అగ్రరాజ్యంలో అడుగుపెట్టడం, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో సమ్మిట్‌లో భాగం కావడం ఇదే మొదటిసారి.
సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గురించి వారు ప్రసంగించడంతో పాటు నాడు నేడు, జగనన్న అమ్మవొడి, జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాలు, విద్యా సంస్కరణలను కూడా సభ్య దేశాలకు వివరించనున్నారు. ద్విభాషా పాఠ్యపుస్తకాలు, టాబ్లెట్‌లు, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, ఆంగ్ల విద్య గురించి తెలియజేయనున్నారు.












Click it and Unblock the Notifications