రాజమండ్రిలో ఎమ్మెల్యే తలసానికి ఘనస్వాగతం....
రాజమండ్రి ; తెలంగాణ యాదవ నాయకునికి మరోసారి ఆంధ్రాలో ఘనస్వాగతం లభించింది. రాజమండ్రిలో ఓ పేళ్లికి వెళ్లిన తెలంగాణ మాజి మంత్రి ప్రస్తుత టిఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదక్ కు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు ఆంధ్ర యాదవ సంఘం నాయకులు..
తెలంగాణ ఎన్నికల తర్వాత సంక్రాంతి సంధర్భంగా ఆంధ్రాకు వెళ్లిన తలసాని విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని మిడియా తో మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ,ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఇస్తానన్న రిటర్న్ గిప్ట్ లో భాగాంగానే విజయవాడకు వచ్చానని సంచలన వ్యాఖ్యలు చేశారు..ఈ నేపథ్యంలోనే అంధ్రాలో బీసి,ఎస్సి,ఎస్టి సంఘాలతో కూడ ఆయన సమావేశమయ్యారు..
రాజమండ్రిలో ఎమ్మెల్యే తలసానికి ఘనస్వాగతం....#TalasasaniSrinivasaYadav #rajamandry pic.twitter.com/UNFaaHQ9zZ
— Oneindia Telugu (@oneindiatelugu) February 13, 2019

ఇక ప్రస్తుతం దేశరాజకీయాల్లో మారుతున్న పరిణామాల నేపథ్యంలో తలసాని ఆంధ్ర పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది....చంద్రబాబు ఢిల్లిలో దీక్ష చేసిన మరునాడే అయన పెళ్లి పేరుతో వెళ్లడం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయా..లేవా అనేది వేచి చూడాలి.. ఏది ఏమయినా..మాములుగా ఓ ప్రైవేటు పెళ్లికి వెళ్లిన శ్రీనివాస యాదవ్ కు మాత్రం రాజమండ్రి ఏయిర్ పోర్టులోనే పెద్ద ఎత్తున ఘన స్వాగతం లభించింంది...












Click it and Unblock the Notifications