సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్ సీల్ (ఫొటోలు)
హైదరాబాద్: నోరూరించే హైదరాబాద్ బిర్యానీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్ హోటల్ మూతపడనుంది. యాజమాన్యం అగ్నిప్రమాదాన్ని నిరోధించే ముందస్తు జాగ్రత్తలు పాటించకపోవడంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) అధికారు ప్యారడైజ్ హోటల్‌ను మూసివేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
జనసమ్మర్థమైన కూడలిలో ఉన్న ఈ హోటల్ నిత్యం బిర్యానీ ప్రియులతో కిటకిటలాడుతూ ఉంటుంది. హైదరాబాద్ బిర్యానీ రుచిని ఆస్వాదించేందుకు దూరతీరాల నుంచి నగరానికి పనిమీద వచ్చిన వారు పనిలోపనిగా ప్యారడైజ్ హోటల్‌ను సందర్శించి రుచులను ఆస్వాదించడం జరుగుతూ ఉంటుంది.
పసందైన బిర్యానీ తయారీలో విఖ్యాతి గడించిన ప్యారడైజ్ హోటల్ భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఆదివారం హోటల్లో అగ్ని ప్రమాదం సంభవించడంతో జీహెచ్ఎంసీ అధికారులు ప్రమాదస్థలిని సందర్శించి కస్టమర్ల భద్రత కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. యాజమాన్యం భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని గుర్తించి హోటల్‌ను సీజ్ చేయాలని అధికారులు నిర్ణయించారు.
ప్యారడైజ్ హోటల్లో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. హోటల్ పార్సిల్ సర్వీస్ వంటగదిలోని చిమ్నీ వద్ద మంటలు ప్రారంభమై వ్యాపించాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలతో నిండిపోయింది.

ప్యారడైజ్ సీల్...
సికింద్రాబాదులోని ప్యారడైజ్ హోటల్ హైదరాబాదు సంస్కృతితో ముడివేసుకుంది. దాన్ని అధికారులు సీల్ చేశారు.

ప్యారడైజ్ సీల్
బిర్యానీ తినడానికి, చాయ్ తాగడానికి దూరదూర ప్రాంతాల నుంచి ప్యారడైజ్‌కు వచ్చే హైదరాబాదీలు ఉన్నారు. ఇప్పుడు దాన్ని సీల్ చేశారు.

ప్యారడైజ్ సీల్
ప్యారడైజ్ హోటల్లోని పార్సిల్ సర్వీస్ వంటగదిలోని చిమ్నీ నుంచి మంటలు ప్రారంభమై వ్యాపించాయి. దాంతో దాన్ని అధికారులు సీల్ చేశారు.

ప్యారడైజ్ సీల్
ఘుమఘుమలాడే బిర్యానీకి ప్యారడైజ్ పెట్టింది పేరు. అటువంటి హోటల్‌ను ప్రమాదం కారణంగా అధికారులు సీల్ చేశారు.

ప్యారడైజ్ సీల్
సికింద్రాబాదులోని ప్యారడైజ్ హోటల్ పేరు వినని వారుండరు. ఆ ప్రాంతానికి ప్యారడైజ్ సెంటర్ అని పేరు. అలాంటి హోటల్‌ను అధికారులు సీల్ చేశారు.












Click it and Unblock the Notifications